పవన్ కళ్యాణ్ స్వభావం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన.. సాగర్ కే చంద్ర!

0
21

దర్శకుడు సాగర్ కె చంద్ర, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కనున్న సంగతి మనందరికీ తెలిసిందే. దర్శకుడు సాగర్ కే చంద్ర ఇంతకు ముందు రెండు మూడు చిన్న సినిమాలు చేశారు. కానీ ఈ సారి ఏకంగా స్టార్ హీరోతో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో నిత్యామీనన్, మలయాళ భామ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్,సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చింది. పవన్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ సినిమాకు రీమేక్ గా వస్తోంది.

ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అద్భుతమైన సాంకేతిక నిపుణుడిగా భావిస్తానన్న సాగర్ కే చంద్ర, రానాను దోసకాయలాంటి చల్లని స్వభావం కలిగిన వ్యక్తి గా అభివర్ణించాడు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మంచి స్వభావం కలవాడని ఆయనతో కలిసి పోవడానికి తనకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే పట్టిందని చెప్పుకొచ్చాడు సాగర్ కె చంద్ర.

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు లాంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో రావు రమేష్, మురళి శర్మ, సముద్రఖని, రఘు బాబు, పలువురు ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here