మొగలిరేకులు సీరియల్ హీరో మున్నా గురించి ఈ మూడు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

0
449

తెలుగు సీరియల్ నటుడు సాగర్ అంటే ఎవరూ టక్కున గుర్తుపట్టలేరు కానీ చక్రవాకం సీరియల్ జగన్, మొగలిరేకులు సీరియల్ మున్నా, ఆర్కే నాయుడు అంటే ప్రతి బుల్లితెర ప్రేక్షకుడు ఇట్టే గుర్తు పడతారు. నిజం చెప్పాలంటే మన భారతీయ సీరియల్స్ చూడ్డానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. కానీ మంజులా నాయుడు గారు దర్శకత్వం వహించిన మొగలిరేకులు, చక్రవాకం సీరియళ్లను… అప్పటి వరకు సీరియల్స్ అంటేనే అసహ్యించుకునే వారు కూడా చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. మొగలిరేకులు సీరియల్ కి అభిమానులు కూడా ఉండాలి అంటే అతిశయోక్తి కాదు. అంత రసవత్తరంగా బుల్లితెర సీరియళ్లను కొనసాగించిన మంజులా నాయుడు గారికి మనం హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.

మొగలిరేకులు సీరియల్ అయిపోయిన తర్వాత కూడా అది చూడాలనుకున్న వారి డిమాండ్ పెరిగిపోవడంతో మళ్లీ మొగలిరేకులు సీరియల్ ప్రసారం చేయడం ప్రారంభించారు. అయితే గతంలో ఎంత ప్రేక్షకాదరణ పొందిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుంది మొగలిరేకులు సీరియల్. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరూ చిన్నపాటి స్టార్స్ గా మారారు అంటే అతిశయోక్తి కాదు. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన సాగర్ బుల్లితెర ప్రభాస్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ బుల్లితెర ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సాగర్ ములుకుంట్ల 1983 ఆగస్టు 16వ తేదీన తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో జన్మించారు. అతను తన తల్లిదండ్రులకు మూడవ సంతానం. అతని విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ నగరంలోనే కొనసాగింది. చిన్మయి విద్యాలయస్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న సాగర్ హైదరాబాద్ నగరంలోని ఏవీ కాలేజీలో కంప్యూటర్స్ లో డిగ్రీ పట్టా పొందారు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుని కూడా అదే కాలేజీలో పూర్తి చేశారు. అయితే పెద్ద చదువు చదివినప్పటికీ అతనికి నటన పై చాలా ఆసక్తి ఉండేది. అందుకే ఏ ఉద్యోగంలో చేరకుండా చాలా సంవత్సరాలపాటు సినీ సీరియళ్ల అవకాశాల కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. కానీ ఎవరూ కూడా అవకాశం ఇవ్వలేదు.

దాంతో విసుకుచెందిన సాగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం లో చేరి హాయిగా జీవితాన్ని గడపాలనుకున్నారు. ఆ సమయంలోనే మంజుల నాయుడు గారు చక్రవాకం సీరియల్ రూపొందిస్తున్నాం అని జగన్ అనే పాత్రలో నటించడానికి ఒక యువ నటుడు కావాలని ఒక ప్రకటన ప్రచురించారు. ఈ ప్రకటన చూసిన సాగర్ చివరిసారిగా ట్రై చేద్దామని ఆడిషన్ కి వెళ్లగా అతన్ని మంజుల నాయుడు గారు సెలెక్ట్ చేశారు. ఆ విధంగా అతను చక్రవాకం సీరియల్ లో జగన్ పాత్రలో నటించే అవకాశాన్ని సంపాదించారు. ఆ తర్వాత మొగలిరేకులు సీరియల్ లో కూడా తానే ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. ఈ రెండు సీరియల్ మినహాయించి మిగతా ఏ సీరియల్ లో సాగర్ నటించలేదు. ఈ సీరియల్స్ లో అతని నటన ప్రతిభకు గాను నంది అవార్డులు కూడా లభించాయి అంటే అతను ఎంత గొప్ప నటుడో స్పష్టమవుతుంది. 2017 అక్టోబర్ 6వ తేదీన సౌందర్య అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే సాగర్ తండ్రి సింగరేణిలో ఉద్యోగం చేసేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here