పాపం సుజాత.. తోలు బెల్టుతో భర్త చేతిలో చావు దెబ్బలు అనుభవించింది…!!

0
2050

హీరోయిన్ సుజాత.. అప్పటి కాలంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో ఈవిడ కూడా ఒకరు. హీరోయిన్ సుజాత పేరు వింటే మనకు మొదటిగా గుర్తొచ్చే సినిమా గోరింటాకు. 1952 డిసెంబర్ 10న పుట్టిన సుజాత తనకు 14 సంవత్సరాల సమయం లోనే చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈవిడ తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలలో మొత్తంగా మూడు వందలకు పైగా సినిమాల్లోనే నటించింది. ఇక ఈవిడ చివరి సినిమా శ్రీరామదాసు. ఇక సుజాత తండ్రి ఇ ఉద్యోగరీత్యా శ్రీలంకలోని గాలే లో పని చేసేవారు. అక్కడ ఉన్న సమయంలోనే ఆవిడ శ్రీలంక లోనే పుట్టి పెరిగింది. ఆయన తండ్రి రిటైర్ అయ్యాక ఫ్యామిలీ మొత్తం తిరిగి ఇండియాకు వచ్చేసింది.

ఇక తనకు 14 సంవత్సరాల సమయంలోనే 1974 సంవత్సరంలో కె.బాలచందర్ డైరెక్షన్ లో ‘ అవ్వాలోరు తుధల్ కథై ‘ సినిమాతో పరిచయమైన ఆవిడ ఆ సినిమా హిట్ అవడంతో తమిళంలో స్టార్ హీరోలు ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, జెమిని గణేశన్ వంటి వారితో ఎన్నో చిత్రాల్లో కలిసి పనిచేసింది. ఇక టాలీవుడ్ పరిశ్రమకు గోరింటాకు సినిమా ద్వారా ఆవిడ పరిచయం అయ్యింది. అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే ఆవిడ టాలీవుడ్ లో ఎన్నో ప్రముఖ చిత్రాలలో ఛాన్సును దక్కించుకుంది. అప్పటి బడా హీరో లైన సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇలా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే శ్రీలంక నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత వారు ఉంటున్న ఇంటి యజమాని వాళ్ళ అబ్బాయిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అతని పేరు జయకర్. ఇక వీరిద్దరికీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉన్నారు. ఇలా జయకర్ ను వివాహం చేసుకున్న ఆవిడ కొన్ని రోజులు అమెరికాకు అతనితో కలిసి వెళ్లి పోయింది.

అయితే ఆమెకు అక్కడి వాతావరణం పడకపోవడంతో తిరిగి మళ్లీ ఇండియాకు చేరుకుంది. ఇండియాకు వచ్చిన తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అయితే, సినిమాలలో అనేక మంది బడా హీరోలతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇంట్లో మాత్రం ఆవిడ పరిస్థితి వేరేగా ఉండేది. సుజాత భర్త జయకర్ సొంతంగా ఏ పని చేయకపోయినా ఇంట్లో ఉంటూ ఆమెను శతవిధాల చిత్రహింసలకు గురి చేసేవాడు. ఒక్కోసారి ఆమె షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత జరిగే గొడవల్లో ఆమెను తన భర్త బెల్టుతో కూడా కొట్టిన సందర్భాలు లేకపోలేదు. అంతేకాదు కొన్ని సార్లు షూటింగ్స్ జరిగే స్పాట్ లో కూడా ఆమెపై చేయి చేసుకున్న సంఘటనలు ఉన్నాయని అప్పట్లో చర్చించుకునేవారు. అయితే ఆవిడ ఎన్నో సినిమాల్లో ఎన్నో కష్టాలను రీల్ జీవితంలో భరించిన ఆవిడ రియల్ లైఫ్ లో కూడా ఆ అనుభవాలను చూసింది. అయితే బడా హీరోల తో అంత మంచి పేరు తెచ్చుకున్న ఈవిడకు సినిమాలు తగ్గడానికి కారణం కూడా ఆమె భర్తనే. ఎవరైనా సినిమా దర్శక నిర్మాతలు సినిమా చేయమని అడగడానికి వస్తే వారికి దిమ్మతిరిగేలా కండిషన్స్ పెట్టి చివరికి ఆమెకు అవకాశాలు లేకుండా చేశాడు తన భర్త జయకర్.

ఇలా తన జీవితం కొనసాగుతున్న సమయంలో ఆవిడ ఒక వైపు సినిమాలలో హీరోయిన్ గా చేసిన రోజులు తర్వాత తల్లిగా, వదినగా, అక్కగా ఇలా విభిన్న రోల్స్ చేస్తూ తెలుగు అభిమానులను మెప్పించింది. ఈమెకు టాలీవుడ్ లో గోరింటాకు, సూత్రధారులు, సర్కస్ రాముడు, సూరిగాడు, వంశ గౌరవం, బహుదూరపు బాటసారి, ఎమ్మెల్యే ఏడుకొండలు, చంటి, పెళ్లి లాంటి చిత్రాల్లో ఆమె నటన మంచి మార్కులే పడ్డాయి. అలాగే 1997 సంవత్సరంలో ఆమె నటించిన పెళ్లి సినిమాకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెస్ట్ క్యారెక్టర్ రోల్ గా నంది అవార్డును కూడా ప్రకటించింది. అంతే కాదు తమిళనాడు రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే కళైమామణి అవార్డును కూడా ఆవిడ దక్కించుకున్నారు. ఇక చివరి సినిమా శ్రీరామదాసు నటించిన తర్వాత కొద్ది కాలానికి ఆమె అనారోగ్యం బారిన పడి చివరికి 58 సంవత్సరాల వయసులో 2006 లో చెన్నై నగరంలో ఉన్న తన ఇంట్లోనే ఆవిడ కన్నుమూసింది.