Kiraak RP: జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ కార్యక్రమం నుంచి తప్పుకొని ప్రస్తుతం రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. హైదరాబాదులో పలు ప్రాంతాలలో ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ ప్రారంభించారు.

ఈ క్రమంలోనే ఈయన రెస్టారెంట్ బిజినెస్ ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ రెస్టారెంట్లో నెల్లూరు నుంచి చేపల పులుసు తయారు చేయడంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి వారందరినీ తీసుకువచ్చారు. అలాగేనెల్లూరు స్టైల్ లో చేపల పులుసును కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ వంటలన్నీ కూడా కట్టెల పొయ్యి పై వండడం ప్రత్యేకత.
ఇక నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ముందు కస్టమర్లు బారులు తీరి ఉంటారు.ఈ విధంగా రెస్టారెంట్ బిజినెస్ లో ఎంతో సక్సెస్ అయినటువంటి ఆర్పీ భారీగా లాభాలను పొందుతున్నారని తెలుస్తుంది. అయితే ఈయన రెస్టారెంట్లో చేపల పులుసు ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Kiraak RP:
*బొమ్మిడాయిల పులుసు – 375 రూపాయలు
*చేప తలకాయ పులుసు – 200 రూపాయలు
*కొరమేను పులుసు – 375 రూపాయలు
*రవ్వ చేపల పులుసు – 285 రూపాయలు
*సన్న చేపల పులుసు _ 250 రూపాయలు
- వైట్ రైస్ -75 రూపాయలు
*రాగి ముద్ద -100 రూపాయలు