Liger cinema Executers : ఒక సినిమా నిర్మించాలంటే కేవలం నిర్మాత, హీరో, డైరెక్టర్ ఉంటే సరిపోదు. ఎంతో మంది సినిమా కార్మికులు అలాగే సినిమా నిర్మాణం కోసం హీరోని, దర్శకుడిని నమ్మి డబ్బు పెట్టే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ రన్ చేసేవాళ్ళు, ఫైనాన్సర్స్ ఇలా ఎంతో మంది ఒక వ్యవస్థలాగా పనిచేస్తారు. సినిమా హిట్ అయితే వీరందరూ బాగుపడుతారు. అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరో, డైరెక్టర్, మిగిలిన ఆర్టిస్తులకు ఏమి కాదు వారి రెమ్యూనరేషన్స్ వాళ్లకు చేరి ఉంటాయి. కానీ అంతిమంగా నష్టపోయేది నిర్మాత మరీ ముఖ్యంగా సినిమాను బిజినెస్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అలాగే థియేటర్ ఓనర్స్. ప్రస్తుతం అలా నష్టపోయిన ఎగ్జిక్యూటర్స్ తమకు నష్ట పరిహారం ఇవ్వండి అంటూ రోడ్డున పడ్డారు.

లైగర్ కు జరిగిన నష్టం తీర్చండి…
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా లైగర్. హిందీ, తెలుగులో ఏక కాలంలో తీసిన ఈ సినిమా ఘోరంగా విఫలం అయింది. భారీగా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిలిచ్చింది. అయితే ఈ సినిమా దర్శకత్వం వహించిన పూరీ, ఛార్మి ఇద్దరూ డిస్ట్రిబ్యూటర్లకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. డబ్బు కొంతైనా వెనక్కి ఇచ్చుంటే అలాగే నెక్స్ట్ సినిమా కూడా మీకు ఇస్తామని చెప్పుంటే డిస్ట్రిబ్యూటర్స్ అలాగే థియేటర్ యాజమాన్యం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసేవారు కాదు.

ఆచార్య సినిమా ఫ్లాప్ అయి నష్టాల్లో ఉన్నపుడు రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసాడు. అతన్ని చూసి విజయ్ దేవరకొండ నేర్చుకోవాలి అంటూ కొంతమంది ఎగ్జిక్యూటర్స్ అభిప్రాయపడ్డారు. విజయ్ నెక్స్ట్ సినిమాలు ఎలా థియేటర్స్ లో ఆడుతాయో చూస్తామంటున్నారు. మేము నష్టపోతే వాళ్ళు నష్టపోతారంటూ ఫైర్ అయ్యారు.