Madan Mitra: మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే.. ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న ప్రజలు..?

0
94

Madan Mitra: సాధారణంగా ప్రజా ప్రతినిధులు సభలు, ర్యాలీలు, మీటింగ్స్ లల్లో పాల్గొన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇలా ప్రజల ముందు పొరపాటున ఏదైన మాట జారినా వెంటనే సరిదిద్దుకోవాలి… లేదంటే ఆ మాటల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికే తమ నోటి దురుసు కారణంగా ఎంతో మంది నాయకులు విమర్శలకు గురైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇటీవల మరో ప్రజాప్రతినిధి మహిళలల పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైయ్యాడు.

తాజాగా టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర భారతీయ సంస్కృతిలో ఐదుగురు భర్తలు ఒకే భార్యను పంచుకోవచ్చని వ్యాఖ్యనించాడు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ బెంగాల్ లో పాఠశాలలో నడుస్తున్న మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కేంద్ర విద్యాశాఖ బృందం తాజాగా సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో భోజన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.

ఐదుగురు వంట సిబ్బందికి కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏడుగురికి సమానంగా పంచుతోందని అధికారులు కనిపెట్టారు. ఈ విషయం పై TMC ఎమ్మెల్యేమదన్ మిత్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారతీయ సంస్కృతిలో ఐదురుగు కలిసి ఒకే భార్యను పంచుకుంటారని అన్నాడు. అంటే ఐదుగురికి కేటాయించిన డబ్బులు పంచుకోవడంలో తప్పులేదని ఎమ్మెల్యే తన వాదన వినిపించాడు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Madan Mitra: మహిళలను కించపరిచిన ఎమ్మెల్యే

రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని చెప్పటానికి మదన్ మిత్రా వ్యాఖ్యలే నిదర్శనం అని ఎమ్మెల్యే , నటి అగ్నిమిత్ర పాల్ ఎద్దేవచేశారు. సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా ఫైర్ అయ్యారు. ప్రజా ప్రతినిధి అయ్యుండి ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సూచించారు. అయితే మదన్ మిత్ర గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచాడు