Michael Film Review : సరైన హిట్ లేక పోయిన ప్రేక్షకుల మీద దండయాత్ర చేస్తూ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ విభిన్న కథలను ఎంచుకుంటూ ఉన్న హీరో సందీప్ కిషన్. వేంకటాద్రి ఎక్స్ప్రెస్ తో మంచి హిట్ అందుకున్న, మొదటి సినిమా హిట్ మాత్రమే ఇప్పటికి చెప్పుకొదగ్గ హిట్ అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా తరువాత ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చిన పెద్దగా అవి హిట్ అవ్వలేదు. కాగా తాజాగా సందీప్ కిషన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ మేనన్ వంటి భారీ తారగణoతో సినిమా చేసాడు. ఇక ఇందులో చాలా రోజులకు వరుణ్ సందేశ్ కూడా కనిపించాడు. ఆ సినిమానే మైఖేల్ సందీప్ కిషన్, దివ్యంశా కౌశిక్ హీరో హీరోయినులుగా నటించిన ఈ సినిమా రంజిత్ దర్శకత్వంలో వచ్చింది. మరీ సినిమా రివ్యూ తెలుసుకుందామా…

కథ వదిలేసి మేకింగ్ పట్టుకుంటే ప్రేక్షకులు సినిమాను వదిలేస్తారు….
సందీప్ కిషన్ కు తొలి పాన్ ఇండియా సినిమాగా మైఖేల్ సినిమాను చెప్పొచ్చు. కథ విషయానికి వస్తే గౌతమ్ మేనన్ అలియాస్ గురునాథ్ పెద్ధ డాన్ ఆయనను చిన్నపుడు సందీప్ అలియాస్ మైఖేల్ ఒక ప్రమాదం నుండి కాపాడతాడు. మరోసారి పెద్ధయ్యాక కూడా కాపాడంతో గౌతమ్ మేనన్ తన సామ్రాజ్యంలో చోటిస్తాడు. తన కొడుకు కన్నా మైఖేల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని కొడుకు వరుణ్ సందేశ్ అలియాస అమర్నాథ్ అసూయతో రగులుతుంటాడు. అలాంటి సమయంలో గురు, మైఖేల్ కి ఒక టాస్క్ ఇస్తాడు. తనని చంపడానికి ఢిల్లీకి చెందిన రత్నాకర్ అనే వ్యక్తి ఆరుమందిని పంపగా అందులో ఐదు మందిని గురు చంపేస్తాడు ఇక రత్నాకర్ అలానే అతని కూతురుని చంపమని చెప్తాడు. అయితే అనూహ్యంగా మైఖేల్ రత్నాకర్ కూతురి ప్రేమలో పడతాడు.

మరీ రత్నాకర్ ను ఎలా చంపాడు, అమర్నాథ్ పగ ఏమవుతుంది విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ , అనసూయ క్యారెక్టర్స్ ఏంటి అనేది తెర మీద చూడాలి. సినిమా ఓవరల్ గా ఒకే అనిపించినా కథ సరిగా డైరెక్టర్ క్యారీ చేయలేదు. ఎమోషనల్ సీన్స్ ను ఫీల్ అయ్యే లోపే మరో సీన్ రావడంతో సినిమాలో ఫీల్ కనిపించదు. ఒకవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కేజీఫ్ సినిమాలో లాగా అనిపిస్తుంది. ఇక సినిమా చూసిన తరువాత పవన్ కళ్యాణ్ పంజా, రంగస్థలం, మణిరత్నం నవాబు సినిమాలు గుర్తొస్తాయి. స్టైలిష్ యాక్షన్ సినిమా గా వచ్చిన మైఖేల్ లో మేకింగ్ కొత్తగా ఆకట్టుకున్న డైరెక్టర్ కొంచెం కథను గుర్తుపెట్టుకుని ఉంటే బాగుండేది. ఇక కథలో భాగంగా యాక్షన్ సీన్స్ రావడం కాదు యాక్షన్స్ సీన్స్ లో కథ పేర్చాడు ట్విస్టులు ఇక్కడ రావాల్సిందే అనేలా ప్లాన్ చేసి సినిమా తీయడం వల్ల కొంత మందికి నచ్చక పోవచ్చు ఓవరల్ గా సందీప్ కెరీర్ లో డిఫరెంట్ సినిమా గా మైఖేల్ ను చెప్పొచ్చు.