Net Flix: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ వచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను మంచిగా ఎంటర్టైన్ చేసింది. ఇలా ఎన్నో ఓటీటీ సమస్థలు కరోనా సమయంలో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇలా అత్యంత ఆదరణ పొందినటువంటి వాటిలో నెట్ ఫ్లిక్స్ ఒకటి.

మన తెలుగులో నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తక్కువగానే ఉన్నప్పటికీ తెలుగులో మంచి ఆదరణ పొందడం కోసం
నెట్ ఫ్లిక్స్ సరికొత్త ప్రయోగం చేసింది అయితే ఈ ప్రయోగంలో భాగంగా నెట్ ఫ్లిక్స్ కు భారీగా కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పాలి.
ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెంకటేష్ తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలుగులో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవాలని ప్రయత్నం చేసిన నెట్ ఫ్లిక్స్ కు ఘోర పరాభవం ఎదురైంది. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరో ఆయన సినిమాలు కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఉంటాయి.

Net Flix:ఒక్క వెబ్ సిరీస్ తో క్రేజ్ మొత్తం కోల్పోయిన వెంకీ…
అలాంటి హీరోని పట్టుకొని బూతు, శృంగార భరితమైన వెబ్ సిరీస్ చేయడంతో ఎంతోమంది ఈ వెబ్ సిరీస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఇన్ని రోజులు వెంకటేష్ సంపాదించుకున్న క్రేజ్ మొత్తం సర్వనాశనం అయింది. ఈ వెబ్ సిరీస్ చూసినటువంటి అభిమానులు ముందుగా వెంకటేష్ ను తిడుతూ ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ను బండ బూతులు తిడుతున్నారు.. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మరింత తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పాలి.