ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది… ఇప్పటికీ పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించినా రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రంజాన్ మాసం నడుస్తున్న వేళ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముస్లింలు అందరిని తమ తమ ఇళ్లలోనే ప్రార్ధనలు చేయాలనీ విజ్ఞప్తి చేసాయి చాలా దేశాల ప్రభుత్వాలు. మరోవైపు ఇస్లామిక్ దేశాలలో కూడా మసీదులను మూసివేశారు. అయితే దాయాది దేశం పాకిస్తాన్ లో కూడా అక్కడ ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లోని కొంతమంది ఇమామ్ లు మాత్రం ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ప్రార్ధనలు చేయడానికి మసీదులకు రావాలని కోరుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కూడా కరోనా భాదితులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. అయితే కొందరు మతపెద్దలు ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా… మరికొందరు మాత్రం శుక్రవారం నాటి ప్రార్ధనలకు రావాలని భక్తులకు పిలుపునిచ్చారు.

వారిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో మసీదులపై లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ కొందరు మతపెద్దలు, ఇమామ్ లు ఒక లేఖపై సంతకాలు చేసి, మసీదులు తెరిపిస్తారా? లేక దేవుడి ఆగ్రహానికి గురవుతారా ? అంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. దీనితో పాకిస్తాన్ ప్రభుతం ఒక అగ్రిమెంట్ ను విడుదల చేసింది. దీని ప్రకారం రంజాన్ మాసంలో మసీదులు తెరిచే ఉంటాయని, కానీ భక్తులు తప్పకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటించాల్సిందే ఆంటూ తెలిపింది. దీని ప్రకారం మసీదుల్లో ఒక్కొక్కరికి మధ్యలో 6 అడుగుల దూరం పాటించాల్సిందే.. అంతేకాదు ఎవరి చాపలు వారు తెచ్చుకోవాలి. చేతులు, కాళ్ళు, ఇంటివద్దనే కడుక్కోవాలి అంటూ ప్రభుతం పలు సూచనలు చేసింది. కాగా ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వాన్ని ఇమామ్ లు ఇలా బెదిరిస్తారా ? అంటూ ఇస్లామాబాద్ కు చెందిన హనసుల్ అమీన్
అనే ప్రొఫెసర్ తీవ్రంగా దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here