మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కైరా అద్వానీ. తెలుగులో నటించిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు స్టార్ స్టేటస్ దక్కింది. హిందీ సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన కైరాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎం ఎస్ ధోనీ, లస్ట్ స్టోరీస్ పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలుగులో భరత్ అనే నేను సక్సెస్ కావడంతో కియారాకు వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ దక్కగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఎలాంటి పాత్రలోనైనా నటించి తన నటనతో మెప్పించే కైరా అద్వానీ తన టీనేజ్ లవ్ విశేషాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో పేరెంట్స్ కోసం తన ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిందని ఈమె వెల్లడించింది. ప్లస్ 2 చదివే విషయంలో తనకు చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదని అదే సమయంలో ఒక అబ్బాయిపై ప్రేమ కలిగిందని తెలిపింది. పాఠాలు కూడా వినకుండా ఆ అబ్బయినే చూసేదానినని అతడంటే అంత ఇష్టం ఉండేదని పేర్కొంది.

సెలవు రోజుల్లో అతని కోసం ఇంట్లో అబద్ధాలు చెప్పి కలవడానికి వెళ్లేదానినని.. అతనంటే అంత ఇష్టమని తెలిపింది. తల్లిదండ్రులు చదువుకోవాలని ఎంత చెప్పిన చదువు బుర్రకెక్కేది కాదని పేర్కొంది. అయితే చదువు, తల్లిదండ్రుల కోసం ప్రేమను త్యాగం చేశానని.. మొదట్లో బాధగా అనిపించినా ఆ తర్వాత మారానని కైరా తన క్యూట్ లవ్ స్టోరీ గురించి చెప్పించారు. కియారా లవ్ స్టోరీ గురించి నెటిజన్లు మీది కూడా మాలా బ్రేకప్ లవ్ స్టోరీనేనా…? అని కామెంట్లు చేస్తున్నారు.

తెలుగులో కైరాకు ఆఫర్లు లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో కైరా బిజీగా ఉంది. కైరా నటించిన లక్ష్మీ బాంబ్, ఇందూ కీ జవానీ సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా షేర్ షా, భోల్ బులియా 2 సినిమాలలో కైరా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here