పవన్ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు! (సోషల్ మీడియాలో వైరలవుతున్న రేణూ దేశాయ్ కామెంట్స్)

0
226

రేణు దేశాయ్ మహారాష్ట్ర లోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. ఆమె మొదట మోడల్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేశారు.

అదే ఏడాది పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన ‘బద్రి’ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహ జీవనం మొదలైంది. పవన్ తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ తోనే ‘జానీ’ సినిమాలో నటించింది. 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. 2009లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి కూతురు ఆద్యా పుట్టింది. ఇక ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. 

ఇక అసలు విషయానికొస్తే.. రేణూ దేశాయ్‌ ఈమధ్య సోషల్‌ మీడియాలో ఓ ముఖ్యమైన పోస్టును షేర్ చేశారు. రేణూ దేశాయ్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ స్వయంగా హైదరాబాద్‌లో ఖరీదైన ఇల్లు కొనిచ్చారంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఈ అంశంపై రేణూకు తెగ ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. దాంతో ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ రేణూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక పోస్టును షేర్ చేశారు. “తన కష్టార్జితంతో హైదరాబాద్‌ లో ఓ ప్లాట్‌ కొనుకున్నానని, ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని, ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మ గౌరవం.. ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయతీ.. ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం అన్న సంగతి మీకు తెలియదా.? నేను, నా జీవన భృతి కోసం ఒంటరిగా, తీవ్రంగా, ఎంతగానో కష్టపడున్నాను. పోరాడుతున్నాను. ఇప్పటి వరకూ కనీసం మా తండ్రి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయాన్ని నేను ఆశించలేదు, తీసుకోలేదు. అలాగే, నా మాజీ భర్త పవన్ దగ్గర్నుంచి కూడా ఎలాంటి భరణాన్నీ ఆశించలేదు, తీసుకోలేదు. అది నా వ్యక్తిత్వం!! అయినా మీరు నా గురించి ఇలా అన్యాయంగా, అసంబద్ధమైన అబద్ధపు రూమర్స్ ను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్లుగా ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న అసత్య ప్రచారాల వల్ల నా నిజాయతీ, ఆత్మగౌరవం, చివరికి నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా?? దయచేసి ఆలోచించండి.

అంతెందుకు.. పవన్ నటించిన ‘ఖుషీ’ సినిమాలోని ఏ మేరా జహా పాట అందరికీ తెలుసు.. దర్శకుడు ఎస్‌జే సూర్య ఈ పాటను 20 నిమిషాల రష్ షూట్ చేసాడు. ఆ పాటను 5 నిమిషాలకు కట్ చేయడానికి ఎడిటర్ మార్తండ్ కే వెంకటేష్ ట్రై చేస్తుంటే.. హిందీ తెలిసిన నేను ఆ పాటను 5 నిమిషాల వరకు ఎడిట్ చేసాను. ఆ టైంలో నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ జీరో. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడు పని చేసినా కూడా నాకు వచ్చిందేమీ లేదు. నాకు ఒక్క రూపాయి కూడా ఎవరూ ఇవ్వలేదు. పవన్‌తో కలిసున్నపుడు ఆయన నటించిన సినిమాలకు చాలా వరకు ఎడిటర్‌గా కూడా వర్క్ చేశాను. కానీ ఫ్రీగానే చేసాను. నేను వర్క్ చేసిన చిత్రాలలో నా పేరు పడలేదు కాబట్టి ఎవరికీ నా టాలెంట్ తెలియలేదు. జీవితంలో ఇప్పటి వరకూ ఏ మగవాడి సాయం లేకుండా ముందుకు సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన పోరాటానికీ గౌరవం ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ.. దయచేసి, ఇలా కించపరచకండి. నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్లీ నాకూ, నా మాజీ భర్త పవన్ ఫ్యాన్స్ కు మధ్య, దయచేసి ఎలాంటి గొడవలు సృష్టించకండి” అని అభ్యర్ధించింది రేణూదేశాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here