Rajasekhar : శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ వచ్చిన వద్దనుకున్నాను..జీవితను కూడా మొదట్లో పక్కన పెట్టాను.. కానీ చివర్లో.. : డా. రాజశేఖర్.

0
258

Rajasekhar : యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర్. తమిళ చిత్రసీమలోకి అడుగు పెట్టకముందు ఒక డాక్టర్. MBBS చదివాడు మరియు చెన్నైలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశాడు.
రాజశేఖర్ దర్శకుడు భారతీరాజా యొక్క తమిళ చిత్రం “పుదుమై పెన్” తో సినీ రంగ ప్రవేశం చేసారు. తమిళ సినిమాతో పరిశ్రమలోకి ప్రవేశించినప్పటికీ,తెలుగు చిత్రాల ద్వారా అతను ప్రజాదరణ పొందాడు. మూడు దశాబ్దాల కెరీర్‌లో రాజశేఖర్ అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు.

2017లో PSV గరుడ వేగతో తిరిగి పుంజుకున్నాడు మరియు పరిశ్రమలో మళ్లీ తన సత్తాను నిరూపించుకున్నాడు. ఐతే
రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట్లో సినిమాల్లోకి రావాలన్న ఆలోచన నాకు ఏమాత్రం లేదు. మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను డాక్టర్ కావాలని కోరుకున్నారు. అందుకే ఎంబిబిఎస్ కోర్సులో చేరాను. అలా చదువుకుంటున్న సమయంలో నాకు ఒక పెళ్లి ప్రపోజల్ వచ్చింది. మా నాన్న వరదరాజన్ అలాగే హీరోయిన్ శ్రీదేవి వాళ్ళ నాన్న అయ్యప్పన్ మంచి స్నేహితులు. మా నాన్న పోలీసుగా శ్రీదేవి వాళ్ళ నాన్న లాయర్ గా సమాజంలో మంచి పేరు ఉన్నవాళ్లు. శ్రీదేవి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మగారికి నేనంటే ఎంతో ఇష్టం. శ్రీదేవిని ఒక డాక్టర్ కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఆ విధంగా ఆ కుటుంబం నుంచి నాకు శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ వచ్చింది.

అప్పటికి నేను ఎంబిబిఎస్ చవుతున్నాను. మళ్లీ మా ఫ్యామిలీలో సినిమా వాళ్లంటే చాలా వ్యతిరేకత. ఎంబిబిఎస్ తర్వాత నన్ను ఎమ్మెస్ చేయాలని మా పేరెంట్స్ నిర్ణయించుకున్నారు. అప్పటికి శ్రీదేవి తెలుగు, తమిళ్ లో అనేక సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమా సంబంధించిన వారని శ్రీదేవిని మా ఫ్యామిలీ టోటల్ గా పక్కన పెట్టింది. అనుకోకుండా నేను సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాను. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో జీవిత హీరోయిన్ గా మంచి సినిమాలు చేశాను. ఆ విధంగా జీవితతో పరిచయం ఏర్పడింది. ఒకసారి జీవిత నాతో పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది. అప్పుడు నేను సింపుల్ గా సినీ ఫీల్డ్ వాళ్లంటే మా ఇంట్లో వాళ్ళు అంగీకరించరని చెప్పాను. జీవిత కూడా అర్థం చేసుకొని మా ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉండిపోయింది. ఆ తర్వాత మగాడు చిత్రం షూటింగ్ లో నేను గాయపడినప్పుడు.. దగ్గర ఉండి నా బాగోగులు చూసుకున్నారు. అలా జీవిత మా పేరెంట్స్ దృష్టిలో పడింది. ఆ తర్వాత వారు మా పెళ్లికి అంగీకరించారు. ఆ విధంగా జీవిత నా సినీ ప్రయాణంలోనే కాకుండా నా జీవన ప్రయాణంలో కూడా నాకు తోడుగా నిలిచిందని ఆ ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పుకొచ్చారు.