Sai Dharam Tej: భయమేస్తోంది దయచేసి నా మాట వినండి… అభిమానులను వేడుకుంటున్న సాయి ధరమ్ తేజ్!

0
43

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ మెగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. అనంతరం తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి వసూలు రాబట్టింది.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సాయిధరమ్ తేజ్ బ్రో విజయయాత్ర అంటూ మూడు రోజులపాటు పలు ప్రాంతాలలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ విజయ యాత్రకు భారీ స్పందన వచ్చింది. ఇకపోతే ఈ యాత్ర ముగిసిన అనంతరం సాయి ధరంతేజ్ అభిమానులను ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్టులో భాగంగా సాయిధరమ్ తేజ తనకు భయమేస్తుంది అంటూ కామెంట్ చేయడం కమనార్హం.

ఇందులో భాగంగా సాయిధరమ్ స్పందిస్తూ బ్రో సినిమా విజయయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ యాత్రలో భాగంగా మీరు చూపించిన అభిమానం సినిమా గురించి మీరు చెప్పిన వ్యాఖ్యలు అందరిని చాలా సంతోషానికి గురి చేశాయని తెలిపారు. అయితే ఈ యాత్రలో భాగంగా చాలామంది అభిమానులు నన్ను కలవడానికి నాతో సెల్ఫీలు దిగడానికి వచ్చారు వారందరికీ నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు అయితే ఈ యాత్రలో భాగంగా చాలా మంది బైక్ పై ర్యాలీ చేస్తూ సెల్ఫీలు వీడియోలు దిగే ప్రయత్నం చేశారు.

Sai Dharam Tej: హెల్మెట్ ధరించండి….

ఇక ఈ విజయ యాత్రలో భాగంగా బైక్ పై వస్తున్నటువంటి అభిమానులు ఎవరూ కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. మిమ్మల్ని అలాంటి పరిస్థితులలో చూస్తే నాకు చాలా భయం వేస్తుందని తెలిపారు. మీరు నా అభిమానులు మాత్రమే కాదు నా బ్రోస్ అంటూ ఈయన తెలిపారు. మీకు ఏదైనా జరిగితే నేను మానసికంగా ఎంతో కృంగిపోతాను దయచేసి బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఉద్దేశించి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.