Sakshi Sivanand: ఇండస్ట్రీలో హీరోయిన్లకు తక్కువ లైఫ్ టైం ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ప్రతి సినిమాకి కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న ఈ క్రమంలోనే పాతవారు ఇండస్ట్రీకి కనుమరుగవుతూ ఉంటారు.ఇలా కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రావడంతో ఎంతో మంది పాత హీరోయిన్లు ఇండస్ట్రీకి కనుమరుగై పోయారు.

కొందరు తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో సందడి చేస్తూ ఉండగా మరి కొందరు మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి వారిలో ఒకప్పటి అందాల తార సాక్షి శివానంద్ ఒకరు. ఈమె మెగాస్టార్ హీరోగా నటించిన మాస్టారు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి ఈమె తెలుగుతోపాటు తమిళ హిందీ మలయాళ భాషలలో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇక ఈమె హీరోయిన్ గా రాజశేఖర్ నటించిన సింహరాశి సినిమా చివరి చిత్రం.ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె 2008లో జగపతిబాబు హీరోగా నటించిన హోమం సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఈమె స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.

Sakshi Sivanand: గృహిణిగా బాధ్యతలు చేపట్టిన సాక్షి శివానంద్..
ఈ సినిమా తర్వాత 2010లో శ్రీకాంత్ హీరోగా నటించిన రంగా ది దొంగ సినిమాలో నటించారు. ఇదే ఈమెకు ఆఖరి చిత్రం ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయినటువంటి సాక్షి శివానంద్ పూర్తిగా గృహిణిగా మారిపోయి ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా ఈమె ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నటువంటి సాక్షి శివానంద్ ని చూసి ఒకప్పటి అందాల తారన ఇక్కడ ఉన్నది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Happy Birthday to Sakshi Shivanand#SakshiShivanand #Actress
About: https://t.co/FxnCqP9IQf pic.twitter.com/Z4K69OVLpX— Celebrity Born (@CelebrityBorn) April 15, 2017