Senior Actor Siva Krishna : ఇప్పటితరం వారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలిసిన శివ కృష్ణ మొదట హీరోగా పరిచయమై మూడు వరుస హిట్లు కొట్టారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ‘మరో మలుపు’ సినిమాతో మొదటి హిట్ హీరోగా అందుకున్న శివ కృష్ణ ఇంట్లో వాళ్ళకి ఆయన సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. ఆ సినిమా తరువాత 16 సినిమా అవకాశాలు వచ్చినా ఆయన నచ్చినవి మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. మరో మలుపు చిత్రం ద్వారా మలుపు తిరిగిన కెరీర్ తో మరోసారి ‘ఈ చరిత్ర’ సినిమా తీశారు ఆ సినిమా కూడా చెప్పుకొదగ్గ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత ‘ఇది కాదు ముగింపు’ సినిమాతో మళ్ళీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలన్నీ కూడా కమ్యూనిజం భావాలు కలిగిన సినిమాలే. వీటి తరువాత ఆయన కమర్షియల్ సినిమాల వైపు నడిచారు. ఊరేగింపు, పదండి ముందుకు, దండయాత్ర, ముందడుగు వంటి సినిమాల్లో నటించారు. కెరీర్ బాగా ఉన్న సమయంలోనే రాజకీయాల వైపు అడుగులేసిన ఆయన అదే తాను చేసిన తప్పు అంటూ అభిప్రాయపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ మొండి వాడు…
ఆరు పదుల వయసు దాటకే రాజకీయాల్లోకి వెళ్లాలంటూ సినిమాలో కెరీర్ బాగా ఉన్నపుడు వెళ్ళకూడదంటూ చెప్పారు శివకృష్ణ. తాను చేసిన తప్పు అదేనని తెలిపారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా తాను హీరోగా ఇంకా మంచి డిమాండ్ ఉన్న వ్యక్తి అయినా కూడా రాజకీయాల్లోకి వస్తున్న విషయం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యణ్ చాలా మొండి వాడు తాను డిసైడ్ అయితే అది చేసి తీరుతాడు.

తనకు ప్రజా సేవ చేయాలనే కోరిక ఉంది అందుకే వచ్చేసాడు. ఇతర రాజకీయ నాయకుల లాగా తన వద్ద బ్లాక్ మనీ లేదు కేవలం తన సినిమాల మీద వచ్చే డబ్బును ఖర్చు పెడుతూ పార్టీని నడుపుతున్నాడు, చాలా కస్టపడుతున్నాడు అంటూ శివ కృష్ణ పేర్కొన్నారు.