Shahrukh Khan: నయనతార చాలా అందగత్తె… వైరల్ అవుతున్న షారుక్ ఖాన్ కామెంట్స్!

0
26

Shahrukh Khan: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి వారిలో నయనతార ఒకరు ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అయినప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించుకున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార గత ఏడాది డైరెక్టర్ విగ్నేష్ నుపెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నయనతార బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా జూన్ నెలలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ సెప్టెంబర్ 7వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీని షారుక్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే నటి నయనతార గురించి కూడా షారుక్ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Shahrukh Khan: స్వీట్ పర్సన్


ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ నయనతార గురించి మాట్లాడుతూ నయనతార అందగత్తె మాత్రమే కాదు ఆమె మనసు ఎంతో మంచిది తను చాలా స్వీట్ పర్సన్ అంటూ నయనతార మంచితనం,ఆమె అందాన్ని పొగుడుతూ షారుక్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా పక్క కమర్షియల్ యాక్షన్ సినిమా అంటూ ఈ సందర్భంగా షారుక్ సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు.