Connect with us

Featured

బాలు ఆరోగ్యంపై శ్రద్ద వహించిన తమిళనాడు ప్రభుత్వం !

Published

on

గాన గంధర్వులు, పద్మభూషణ్ డాక్టర్ శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం త్వరితగతిన మెరుగు పరిచే ప్రయత్నంలో తమిళనాడు ప్రభుత్వం చురుగ్గా వున్నట్లుగా, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని MGM హెల్త్ కేర్ వైద్యశాలలో బాలుగారికి చికిత్స చేయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఆదివారం బాలు గారి కోసం MGM హెల్త్ కేర్ హాస్పిటల్ లో ప్రత్యేకంగా ఒక ఐసోలేషన్ రూమును రూపొందించినట్లు, ఆదివారం చెన్నైలో సంపూర్ణ లాక్ డౌన్ అయినా ముఖ్యమంత్రి చొరవతో ఐసోలేషన్ రూమును కావలసిన సామాగ్రి అంతా బయట నుండి వాహనాల్లో రప్పించ్చారని, అలాగే MGM లో కరోనా చికిత్స కోసం బాలు గారు చేరారన్న వార్త చెవిలో పడ్డప్పటి నుండి భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు యాజమాన్యంతో మాట్లాడుతూ బాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారని తెలిసింది. గతంలో చెన్నైలోని MGM హెల్త్ కేర్ ను వెంకయ్యనాయుడు చేతుల మీదుగానే ప్రారంభించబడడం విశేషం.

వెంకయ్యనాయుడు సూచనల మేరకు ప్రత్యేక ఐసోలేషన్ ను – హాస్పిటల్ లో యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిసింది. ఔ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యాలయం ఎప్పటికప్పుడు బాలు గారి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్స్ తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఈ సందర్భంగా మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది . కన్నడ గాయకుడిగా బాలు గారు ఎంత ఖ్యాతి గడించాడన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఇదిలావుండగా.. కేంద్ర ప్రభుత్వం , పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గాన గంధర్వులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు సేకరిస్తుంటే.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంద్రప్రదేశ్ లకు చెందిన తెలుగు ముఖ్యమంత్రులు K.చంద్రశేఖర రావు గాని, Y.s జగన్ గాని నేటికి కూడా బాలు గారి ఆరోగ్యం గురించిన వివరాలను ఫోన్లో వాకబు చేయకపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. బాలుగారికి కరోనా పాజిటివ్ సోకిన క్రమంలో “మా నాన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, మి అమ్మ సావిత్రి గారి ఆరోగ్యాలు మెరుగవుతున్నాయి” అని ఆయన కుమారుడు చరణ్ బాబు ప్రకటించినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులు, బాలు గారి అభిమానుల వదనాల్లో ఆనందం వ్యక్తమౌతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Rana: నన్ను ఏదైనా అడగాలంటే అవయవాలు దానం చేయాలి… రానా కామెంట్స్ వైరల్!

Published

on

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు. ఈయన లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇలా దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి రానా ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో నటించడానికి కూడా రానా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా రానా గుర్గావ్ లో జరిగిన సినాప్స్ వేడుకలలో రానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆరోగ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రానా ఇటీవల కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన తన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ..

Advertisement

ప్రకృతికి మించిన వైద్యం లేదు…
ఎవరైనా నా ఆరోగ్యం గురించి ఏదైనా అడగాలి అంటే ముందుగా మీరు అవయవాలు దానం చేస్తానని చెప్పండి. అలాంటి ఆలోచన మీకు ఉంటేనే నన్ను నా ఆరోగ్యం గురించి అడగండి లేదంటే ఆలోచనను విరమించుకోండి అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనిషి చివరిదశలో ఉన్నప్పుడే జీవితాన్ని విభిన్నంగా చూస్తాడు.ఆ క్షణం ఆలోచన విధానం మారిపోతుంది. ఇందుకు నేను మినహాయింపు కాదని తెలిపారు. అనారోగ్య సమస్యల కారణంగా బాహుబలి సినిమా సమయంలో పెరిగిన బరువు పూర్తిగా తగ్గిపోయానని అనంతరం అరణ్య సినిమా కోసం ఏడాది పాటు అడవులలో తిరుగుతూ ఉన్నానని ప్రకృతికి మించిన వైద్యం మరేది లేదంటూ ఈ సందర్భంగా రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

NTR: ఎన్టీఆర్ సినిమా చేయాలంటే ఈ రెండు ఉండాల్సిందేనా?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్లో దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలి అంటే కచ్చితంగా ఆయన ఒప్పుకొనే సినిమాలలో రెండు అంశాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలని ముందుగానే దర్శక నిర్మాతలకు సూచిస్తారట మరి ఎన్టీఆర్ సినిమాలలో తప్పనిసరిగా ఉండాల్సిన ఆ అంశాలు ఏంటి అనే విషయానికి వస్తే..

Advertisement

డాన్స్… యాక్షన్ సీక్వెన్స్..
ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాలు డాన్స్ చేసే విధంగా పాటలకు స్కోప్ ఉండాలని ఈయన కండిషన్ పెడతారట అదే విధంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండాలని ఈయన దర్శక నిర్మాతలకు చెబుతారట. ఈ రెండు తన సినిమాలలో తప్పనిసరిగా ఉండేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ బాబుకు కలిసి రాని తల్లి సెంటిమెంట్… మూడుసార్లు చేదు అనుభవమే?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది.

ఇలా ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాకపోవడం ఒక కారణం కాగా ఈ సినిమాపై నెగటివ్ టాక్ తో భారీగా వైరల్ చేయడం కూడా సినిమాకు పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సెంటిమెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయిందని చెప్పాలి.

చిన్నప్పుడే కొడుకును వదిలేసి వెళ్లిపోయినటువంటి తల్లికి తన కొడుకు పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అదేవిధంగా ఈ సినిమా విషయంలో మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పాలి.

Advertisement

తల్లిని నమ్ముకుంటే కష్టమే…
మహేష్ బాబుకి తల్లి సెంటిమెంట్ సినిమాలు పెద్దగా కలిసిరావనే విషయాలు గతంలో కూడా నిజమయ్యాయి. అయితే మరోసారి కూడా ఈయనకు తల్లి సెంటిమెంట్ అచ్చి రాలేదని తల్లిని నమ్ముకుంటే మహేష్ బాబుకి చేదు అనుభవమేనని గుంటూరు కారం నిరూపించింది. గతంలో కూడా మహేష్ బాబు తల్లి సెంటిమెంటుతో వచ్చినటువంటి సినిమాలలో నాని అలాగే నిజం సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!