మీకు స్మార్ట్ ఫోన్ ఉందా.. అయితే నెలకు ఇలా రూ.30 వేలు సంపాదించండి..

0
104

ప్రస్తతం ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఉంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లు ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ సింపుల్ గా నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చు. దానికి మన దగ్గర కాస్తంత తెలివి, టాలెంట్ ఉంటే చాలు. ఫ్లిప్‌కార్ట్ కొత్తగా ప్రారంభించిన Shopsy ప్లాట్‌ఫామ్ ద్వారా ఇది సాధ్యం. ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయండి అంటూ పిలుపునిస్తోంది షాప్సీ ప్లాట్‌ఫామ్.

ఇందులో ఆ సంస్థకు సంబంధించిన పలు రకాలు ప్రొడక్ట్స్ డిస్ ప్లే అవుతూ ఉంటాయి. అందులో మనం స్నేహితులు, బంధువులకు రికమండ్ చేసి వాళ్లు అందులో ఏదైనా నచ్చినట్లు చెబితే దానిని ఆర్డర్ పెట్టి సింపుల్ గా డబ్బులను సంపాదించవచ్చు. ఇది కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా ప్రతీ పట్టణానికి, నగరానికి చేరువ చేసేలా షాప్సీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. 2.5 కోట్ల మంది ఆన్‌లైన్ ఆంట్రప్రెన్యూర్లను 2023 నాటికి దీనిలో చేర్చుకోవాలనే లక్షంగా పెట్టుకుంది ఫ్లిప్ కార్ట్. ఎవరైనా సరే ఇందులో రిజిస్టర్ అయి మన వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు.

దీనిలో రిజిస్టర్ అవ్వాలంటే మన దగ్గర ఎలాంటి ప్రూప్స్ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఆ తర్వాత అందులో కనిపించే ప్రొడక్ట్స్‌ని వాట్సప్ లాంటి మెసేజింగ్ యాప్స్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌లో షేర్ చేస్తూ ఉండాలి. అందులో వారికి నచ్చిన ప్రొడక్ట్ ను మనం ఆర్డర్ ఇచ్చి లాభాలు పొందొచ్చు. ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే ఎంత కమిషన్ వస్తుందనేది ఆ ప్రొడక్ట్‌పై ఆధారపడి ఉంటుంది. కమీషన్ విషయానికి వస్తే లాప్ టాప్ లాంటి పెద్ద ప్రొడెక్ట్ ఆర్డర్ చేస్తే దాదపు రూ. 5వేలు కమీషన్ వస్తుంది. అదే స్మార్ట్ ఫోన్ చేస్తే రూ.50 వస్తాయి.

మనం ప్రొడక్ట్ ను ఓపెన్ చేయగానే కమీషన్ ఎంత అనేది మనకు కనిపిస్తుంది. మీరు ఆర్డర్ చేసేప్పుడు ఎవరి కోసం ఆర్డర్ చేస్తున్నారో వారి అడ్రస్ ఎంటర్ చేయాలి. ప్రొడక్ట్ ఫ్లిప్‌కార్ట్ ప్యాకేజింగ్‌తో వారి అడ్రస్‌కు వెళ్తుంది. రిటర్న్ గడువు ముగిసిన తర్వాత మీ అకౌంట్‌లోకి కమిషన్ వస్తుంది. ఇలా చేస్తూ ఆన్ లైన్ ఎంలాంటి రిస్క్ లేకుండా నెలకు రూ.30వేలు సంపాదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here