Connect with us

Political News

కోవిడ్ పై పోరాటానికి తమిళనాడు బీజేపీ కొత్త అస్త్రం!

Published

on

కోవిడ్ థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు బిజెపి నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు సహాయపడేందుకు 26,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై పేర్కొన్నారు.

Advertisement

కాగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన డీఎంకే వంటి పార్టీలు వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నాయని గుర్తు చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

Advertisement

Featured

Pawan Kalyan: పవన్ పై ప్రశంసలు కురిపించిన పేర్ని నాని… సాహసం చేశారంటూ?

Published

on

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ వైకాపా మంత్రి పేరుని నాని ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటూ ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి షిప్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే

Advertisement

ఈ విషయం గురించి పేర్ని నాని మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి సంబంధించిన శాఖ కాకపోయినప్పటికీ తన ప్రాణాలకు తెగించి మరీ సముద్రంలోకి వెళ్లినందుకు తనని ప్రశంసిస్తున్నానని తెలిపారు..అనుభవమున్న రంగం కాబట్టి షిప్ చుట్టూ గిరగిరా తిరుగుతూ వీడియోలు తీశారని, మంచి ప్రయత్నమే కానీ పవన్ పర్యటనపై అంతా అనుమానంగానే ఉందని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో భాగంగా రెండు నెలల నుంచి నాకు ఇక్కడకు రావడానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు కష్టమ్స్ ఆఫీసర్, పోర్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా బోర్డు లోనే ఉన్నారు మరి ఆయనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఒకటి చంద్రబాబు నాయుడు అయినా తనకు అనుమతి తెలపక పోవాలి లేదంటే పవన్ కళ్యాణ్ అయిన అబద్ధం చెప్పి ఉండాలని పేరుని నాని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటూ స్టెల్లా షిప్ నే ఎందుకు సీజ్ చేశారు సీజ్ ద షిప్ అని కెన్ స్టార్ షిప్ ను ఎందుకు అనలేదని, ఆ షిప్ దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు. ఆ షిప్ లో అక్రమంగా బియ్యం రవాణా జరిగి ఉండదా అంటూ ఈయన సరికొత్త సందేహాలను వ్యక్తపరిచారు.స్టెల్లా షిప్ ను 36 మంది ఎక్స్ పోర్టర్లు 35 వేల టన్నులు ఎక్స్ పోర్టు కోసం తెచ్చుకున్నారు. కెన్ స్టార్ షిప్ లో ఒకే ఎక్స్ పోర్టర్ 42 వేల టన్నుల బియ్యం ఎక్స్ పోర్టు చేస్తున్నారు.

Advertisement

Pawan Kalyan: పయ్యావుల కేశవ్..

మరి పవన్ కళ్యాణ్ ఎందుకని కెన్ స్టార్ షిప్ దగ్గరకు వెళ్లలేదు అంటూ ఈయన ప్రశ్నించారు ఎందుకంటే ఆ షిప్ స్వయానా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు వేల్పూరి శ్రీనుకి సంబంధించినది కావటం విశేషం. అందుకనే పవన్ కళ్యాణ్ ఈ షిప్ వద్దకు వెళ్లలేదు అంటూ సరికొత్త సందేహాలను బయటపెట్టారు.

Advertisement
Continue Reading

Featured

Byreddy shabari: పుష్ప 2 పై టీడీపీ ఎంపీ షాకింగ్ పోస్ట్… కట్ చేస్తే పోస్ట్ డిలీట్.. ఏమైందంటే?

Published

on

Byreddy shabari: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొంతమంది ఈ సినిమాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే .ఇటీవల నాగబాబు కూడా ఈ సినిమాపై పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి పోస్ట్ చేయగా మరో టిడిపి ఎంపీ కూడా సెటైరికల్ గా పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Advertisement

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అయితే వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఆమె అల్లు అర్జున్ ని పరోక్షంగా విమర్శలు చేశారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ గారు మీరు నంద్యాలలో ఎన్నికల ప్రచారం చేయటాన్ని ఇప్పటికీ ఇక్కడ ప్రజలు మర్చిపోలేదు. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్ నిర్వహించినట్టుగా మీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నంద్యాలలో చేస్తారని మేము ఆశించాము. నంద్యాలలో మీ సెంటిమెంటు మాకు చాలా బాగా పనిచేస్తుంది మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అయింది. మీరు నటించిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఈమె పోస్ట్ చేశారు.

Byreddy shabari: నంద్యాల సెంటిమెంట్..

ఇక అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వచ్చినప్పటికీ తన స్నేహితుడు శిల్పా రవి ఓడిపోయారు. ఈ విషయాన్ని ఈమె గుర్తు చేస్తూ నీ సినిమా వేడుకను కూడా ఇక్కడే నిర్వహించాల్సిందే అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారనీ అల్లు అర్జున్ అభిమానులు ఈమెపై భారీగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ వివాదానికి కారణం అవుతుందన్న ఉద్దేశంతోనే ఎంపీ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

RGV: అప్పటివరకు వర్మను అరెస్ట్ చేయొద్దు.. వర్మకు ఊరట ఇచ్చిన హైకోర్టు!

Published

on

RGV: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు కాస్త ఊరట కల్పించింది. ఈయనపై కేసు నమోదు కావడంతో తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాలి అంటూ రామ్ గోపాల్ వర్మ కోరుకున్న ఆశ్రయించడంతో కోర్టు ఆ పిటిషన్కొట్టి వేసింది అయితే ఈయన మరోసారి ముందస్తు బెయిల్ కు అప్లై చేశారు.

Advertisement

తనపై కేసు నమోదు కావడంతో పోలీసులు కనుక తననీ అరెస్టు చేస్తే తప్పనిసరిగా తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని అందుకే తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఈయన కోరారు. ఇప్పటికే ఈ బెయిల్ విచారణ పలు సందర్భాలలో వాయిదా పడింది తాజగా ఈ బెయిల్ పిటిషన్ పరిశీలించిన కోర్టు వచ్చే సోమవారం వరకు ఈయనని అరెస్టు చేయొద్దు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విధంగా వచ్చే సోమవారం వరకు ఈయనని అరెస్టు చేయకూడదు అంటూ ఆదేశాలను జారీ చేయడంతో రామ్ గోపాల్ వర్మకు కాస్త ఊరట కలిగిందని చెప్పాలి. ఇక ఈయన వచ్చే సోమవారం లోపు సరైన వివరణ ఇవ్వకపోతే కోర్టు తిరిగి ఈయనపై చర్యలు తీసుకోవడం, లేదా అరెస్టు చేయడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.

RGV: అరెస్టు వద్దు..

ఇలా రాంగోపాల్ వర్మ వచ్చే సోమవారం లోపు తన వివరణ ఇస్తారా లేదంటే అరెస్టయి జైలుకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వచ్చే సోమవారం వరకు తనని అరెస్టు చేయకూడదు అంటూ కోర్టు ఆదేశాలను ఇవ్వడంతో ఈయనకు కాస్త ఊరట కలిగిందని చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!