భార్యలు ఇలాంటి భర్తలనే ఎక్కువగా ప్రేమిస్తారంట..!

0
567

చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఆ కుటుంబం సంతోషకరమైన జీవనం గడుపుతోంది. అలా కాకుండా ఆలూమగలు గొడవలు పడుతూ ఉంటే మాత్రం ఆ ఇంట్లో ప్రశాంతతే కరువవుతుంది. భార్య మైనస్ లను భర్త, భర్త మైనస్ లను భార్య గుర్తు పెట్టుకుని ఎలాంటి సమస్యనైనా కలిసిమెలిసి పరిష్కరించుకుంటే ఆ కాపురం నిండునూరేళ్లు పిల్లాపాపలతో ఆనందంగా జీవిస్తుంది.

అయితే పలు అధ్యయనాల్లో భార్యలు భర్తల నుంచి కొన్ని ఆశిస్తారని.. ఆ ఆశలకు అనుగుణంగా ఉండే భర్తలనే ఇష్టపడతారని తేలింది. ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉన్న భర్తలను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారని వెల్లడైంది. ప్రేమగా, గౌరవం, విశ్వాసంతో ఉండే భర్తలు భార్యలకు ఎక్కువగా నచ్చుతారు. భార్యలు భర్తలు చేసిన చిన్న పనినైనా, పెద పనినైనా ప్రశంసించాలని కోరుకుంటారు. భర్త ప్రశంసిస్తే తమ పనికి తగిన గుర్తింపు లభించిందని భార్యలు భావిస్తారు.

చాలా కుటుంబాలలో భర్తలు భార్య నిర్ణయాన్ని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అలా చేయడం భార్యలకు ఏ మాత్రం నచ్చదు. అలా కాకుండా కీలక విషయాల్లో తమ సలహాలు, సూచనలు తీసుకోవాలని భార్యలు భావిస్తారు. భార్యలు ఎక్కువగా సర్పైజ్ లను ఇష్టపడతారు. సినిమాలు, బహుమతులు లాంటివి అప్పుడప్పుడూ ఇవ్వడం వల్ల వాళ్లు ఆనందంగా ఉంటారు.

భార్యలు భర్తలు పూలు తెచ్చినా స్వీట్లు తెచ్చినా సంతోషపడతారు. భార్యల చిన్నచిన్న ఇష్టాలను, అభిరుచులను తెలుసుకుని భర్తలు తీర్చాలని వాళ్లు కోరుకుంటారు. కలిసి ఫోటోలు దిగడం, కుటుంబంతో కొంత సమయాన్ని భార్యలు ఎక్కువగా కోరుకుంటారు. ఏవైనా సమస్యలు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలని భార్యలు కోరుకుంటారు.