ఆకాశం నుంచి వేల సంఖ్యలో కింద పడుతున్న చేపలు… వర్షం లేకుండానే.. ఎలాగంటే?

0
97

సాధారణంగా వర్షాలు పడుతున్నప్పుడు ఆకాశం నుంచి చేపలు, కప్పలు వర్షంతో పాటు భూమిపై పడటం మనం చూస్తుంటాము. చెరువులు సముద్రాలు మీదుగా వీచే గాలుల వల్ల చెరువులో ఉన్నటువంటి చేపలు గాలి ద్వారా మేఘాలలోకి వెళ్తాయి. ఈ క్రమంలోనే వర్షం కురిసినప్పుడు మేఘాలలో ఉన్నటువంటి చేపలు కింద పడుతుంటాయి. కానీ అమెరికాలో మాత్రం వర్షం లేకుండా ఆకాశం నుంచి వేల సంఖ్యలో చేపలు సరస్సులు కొలనులలో పడుతున్నాయి. ఇది ఎలా సాధ్యం అయింది అంటే…

అమెరికాలోని ఉటా వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఆ దేశంలోని వివిధ సరస్సులు, చెరువుల్లో విమానాల నుంచి కొన్ని వేల సంఖ్యలో చేపలను వదులుతున్నారు.ఈ విధంగా విమానాల ద్వారా చెరువులోకి చేపలను వదలడానికి గల కారణం ఆ చెరువులకు ఎటువంటి రోడ్డు రవాణా మార్గాలు లేకపోవడంతో ఈ విధంగా విమానాల ద్వారా చేపలను వదులుతున్నారు. ఈ విధంగా విమానాల ద్వారా చేపలను వదులుతున్నటువంటి వీడియోను వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.facebook.com/UtahDWR/videos/1494993280849050/

ఒక విమానంలో సుమారుగా వంద పౌండ్లకు పైగా నీటిని తీసుకెళ్లగలదని, ఒకే ట్రిప్ 35 వేల చేపలను సరస్సులో విడువగలదని వైల్డ్ లైఫ్ రిసోర్స్ ఏజెన్సీ తెలిపారు. ఈ పద్ధతి ఉటాలో 1950 నుంచి పాటిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ విధంగా విమానాల ద్వారా చేపలను సరస్సులలో వదలటం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, మత్స్య సంపద కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here