Tollywood : భాష, యాసలతో కూడుకున్న మొరటైన కథలను ఎక్కువగా మనం తమిళ చిత్రాలలో చూస్తుంటాం. ఎందుకో ఈమధ్య డైరెక్టర్ సుకుమార్ అలాంటి కథలకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి కథతో వచ్చిన సినిమాలే ఆయనకి సినీ పరిశ్రమలో పేరును తీసుకువచ్చాయి.

1985లో జరిగిన.. ఇతివృత్తంగా “రంగస్థలం” సినిమా కథని తీర్చిదిద్దారు. ఓ పాత కథ , ఏమాత్రం కొత్తదనం లేదు. కానీ కథ స్క్రీన్ ప్లే ఓ కొత్త తరహాలో వెళుతుంది. గోదావరి ప్రాంతాన్ని ఏ సినిమాలో తీసుకున్న నీటితో నిండిన గోదావరి పారుతుంటే.. సగటు ప్రేక్షకుడు ఎంతో ఆనందపడేవాడు. ఆ సినిమా కూడా అంతటి ఘన విజయాన్ని సాధించేది. అలా ఈ చిత్రానికి రామ్ చరణ్,సమంత లాంటి హీరో, హీరోయిన్స్ తోడవడంతో సూపర్ హిట్ గా నిలిచింది.

మొరటైన పచ్చి పల్లెటూరు కథతో వచ్చిన రంగస్థలం చిత్రాన్ని ప్రేక్షకులు హిట్ చేయడంతో.. డైరెక్టర్ సుకుమార్ మళ్ళీ ఓ మొరటైన కథ తో ఓ సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో.. ఈసారి ఆయన కొత్త ప్రాంతాన్ని అంటే రాయలసీమ నేపద్యంలో సినిమా రూపొందించాల అనుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కథ సాగేలా సుకుమార్ ఓ కథను రాసుకున్నాడు. తిరిగి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో.. అల్లు అర్జున్, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా “పుష్ప” సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూడని విధంగా పూర్తిగా డిగ్లామరైజ్ చేస్తూ డైరెక్టర్ సుకుమార్ రాయలసీమ స్లాంగ్ తో కథని నడిపించిన తీరు తెలుగు ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యేలా చేసింది. అలా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతాలైన ఆంధ్ర, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రంగస్థలం, పుష్ప చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరొక తెలంగాణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో కూడా డైరెక్టర్ సుకుమార్ ఓ సినిమా రూపొందిస్తారని ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూసారు. ఆ సమయంలో.. ఆయన శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఓ మొరటు కథ తయారు చేసుకున్నారు.ఆ కథకి తగిన విధంగా.. తెలంగాణ ప్రాంతం, సింగరేణి పరిసర ప్రాంతాలను ఎంచుకున్నారు.

అయితే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో “దసరా” సినిమా విడుదలయింది. ఈ సినిమాలో నాని,కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించారు. కథలో కొత్తదనం పెద్దగా లేనప్పటికీ హీరో నానిని ఇంతకుముందు డిగ్లామర్ గా ప్రేక్షకులు చూడలేదు. నాని అలా కొత్తగా కనిపించడంతో.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అలా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు తెలుగు ప్రాంతాల నేపథ్యంతో కూడుకొని వచ్చిన ఈ మూడు సినిమాలు విజయదుందుభి మోగించాయి.