యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 244 ట‌్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష లేదు. మార్కులను ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పది, ఇంటర్ మార్కులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. http://uraniumcorp.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పదోతరగతి 50 శాతం మార్కులతో, ఐటీఐ సంబంధిత ట్రేడ్ లో 60 శాతం మార్కులతో పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
18 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఖాళీల విషయానికి వస్తే ఫిట్టర్ 80, ఎలక్ట్రిషన్ 80, వెల్డర్ 40, టర్నర్ లేదా మెషినిస్ట్ 15, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 10, ఎంవీ మెకానిక్ 10, కార్పెంటర్ 5, ప్లంబర్ 4 ఖాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదట్లో తక్కువగానే వేతనం లభించినా అనుభవం పెరిగే కోద్దీ వేతనం పెరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.