నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో నెలకు లక్ష రూపాయల వేతనం..?

0
104

రక్షణ రంగం దేశానికి సేవ చేయాలనే ఆలోచన ఉన్న నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీ, నేవల్ అకాడమీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్రం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి రెండుసార్లు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది.

ఈ ఏడాదికి తొలి విడత నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా రెండో విడత నోటిఫికేషన్ ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. త్రివిధ దళాల విభాగాల్లో ఎంపికైన వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఐఎన్ఏసీ కోర్సును సక్సెస్ ఫుల్ గా ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. పెళ్లి కాని వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏదైనా గ్రూపులో ఇంటర్ పాసై నిర్ణీత శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. రాతపరీక్షలో మొత్తం 900 మార్కులకు పరీక్ష ఉంటుంది. వర్తమన వ్యవహారాలపై ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

అర్హత పొందిన వారు ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ పరీక్షలకు హాజరై అందులో అర్హత సాధిస్తే గ్రూప్ డిస్కషన్, ఇతర టెస్టుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. https://upsconline.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెల 18వ తేదీన పరీక్ష జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here