Urvashi Rautela: 76వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్స్ ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో బాగంగా ఎంతోమంది సినీ తారలు ఈ వేడుకలో సందడి చేశారు. ఇక ఫిలిం ఫెస్టివల్స్ లో భాగంగా నటి ఊర్వశి రౌటేలా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. గులాబీ రంగు డ్రెస్ ధరించి న ఈమె మెడలో మొసలి నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా మొసలి నెక్లెస్ తో పాటు ఇయర్ రింగ్స్ కూడా ధరించారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ అలాంటి ఫిలిం ఫెస్టివల్స్ కి కూడా ఫేక్ జ్యువెలరీ వేసుకుని వెళ్లడం అవసరమా అంటూ ఈమె ఫోటోలపై కామెంట్లు చేశారు. ఇలా ఊర్వశి ఫోటోలు పై కామెంట్లు చేయడంతో తన టీమ్ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.
ఈ సందర్భంగా ఊర్వశి టీం ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ… ఊర్వశి ధరించిన మొసలి నక్లెస్ నిజమైన దేనని క్లారిటీ ఇచ్చారు. ఈట్ నెక్లెస్ ధర 276 కోట్ల రూపాయలు అని తెలియజేయడంతో అందరూ ఒకింత ఆశ్చర్య పోవడమే కాకుండా మరికొందరు కామెంట్ చేస్తూ నెక్లెస్ ధర ఇలా కోట్లు రూపాయలలో ఉంటుందా జోక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Urvashi Rautela: 276 కోట్ల ధర…
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఊర్వశి రౌటేలా ఈ మధ్యకాలంలో వరుస స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా సందడి చేస్తున్నటువంటి ఈమె కెన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఓ మెరుపు మెరుసారు.