Vj Sunny : సెన్స్ లేకుండా సినిమా చేయకూడదు… అన్ స్టాపబుల్ మంచి హిట్ అవుతుంది…: విజే సన్నీ

0
131

VJ Sunny : జర్నలిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆపైన వీడియో జాకీ గా అలాగే సీరియల్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న విజే సన్నీ అపైన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ కి ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. అప్పటికే ‘సకల గుణాభి రామ’ అనే సినిమా చేసినా అది ఎపుడు వచ్చిందో ఎపుడు వెళ్లిందో ఎవరికీ తెలియదు. అయితే ప్రస్తుతం మాత్రం వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు విజే సన్నీ. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అన్ స్టాపబుల్ సినిమా విశేషాలని ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

అలాంటి సినిమా చేయరాదు…

సన్ అఫ్ ఇండియా సినిమా డైరెక్టర్ అయిన డైమండ్ రత్న బాబు డైరెక్ట్ చేసిన మరో సినిమా అన్ స్టాపబుల్. సన్నీ హీరోగా పలాస హీరోయిన్ నక్షత్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రఘు బాబు, బిత్తిరి సత్తి, చమ్మక్ చంద్ర, సప్తగిరి, అజయ్ వంటి వారు నటిస్తున్నారు. సినిమా కామెడీ ప్రధానంగా తెరకెక్కగా ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటుందని సన్నీ ఆశాభావం వ్యక్తం చేసాడు.

డైమండ్ రత్న బాబు రచన చాలా బాగుంటుందని సన్ అఫ్ ఇండియా సినిమాను మర్చిపోయి జనాలు ఈ సినిమాతో రత్న బాబును గుర్తిస్తారు అంటూ తెలిపాడు సన్నీ. కథలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయంటూ, ఏ మాత్రం సెన్స్ లేకుండా సినిమాలను చేయరాదంటూ చెప్పాడు.