తాజా పండ్లు, కూరగాయలు మన శరీరానికి ఎంతో మంచిదని మనం భావిస్తాము. అయితే కొందరు ఈ పండ్లు ఆరోగ్యానికి మంచిదని భావించి ఎక్కువ శాతం పండ్లను తీసుకుంటారు.ఆ విధంగా కొందరు ఉదయం అల్పాహారం తినకుండా కేవలం పండ్లను మాత్రమే తింటూ ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఈ విధంగా పరగడుపున పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కన్నా అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే పరగడుపున పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇక్కడ తెలుసుకుందాం…

ఉదాహరణకు ఉదయం ఏమీ తినకుండా పరగడుపున మామిడి పండును తీసుకోవడం వల్ల మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల దాని ప్రభావం మన కిడ్నీలపై పడుతుంది. కేవలం మామిడి పండు మాత్రమే కాకుండా ద్రాక్ష, ఆరెంజ్, పైనాపిల్ వంటి పులుపు ఉన్న పండ్లను తినకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా వాటి నుంచి అధిక శాతం ఆసిడ్ విడుదల కావడం వల్ల మన శరీరంలో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కొందరు అరటిపండు తినడం వల్ల తొందరగా జీర్ణక్రియ అవుతుందని ఉదయం అరటిపండు తినడం చేస్తుంటారు. పరగడుపున అరటిపండు తినడం వల్ల కొన్నిసార్లు వాంతులు అవుతాయి.కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లను పరగడుపున తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకోసమే ఉదయం ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న తరువాత పండ్లను తీసుకున్నప్పుడు మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here