రోజూ ఈ ఒక్క పని చేస్తే సులువుగా బరువు తగ్గడం గ్యారంటీ..?

0
169

మనలో చాలామంది సులువుగా బరువు తగ్గాలని భావిస్తూ ఉంటారు. అయితే తాము బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం మాత్రం సాధ్యం కాలేదని చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో మన ఆహారపు అలవాట్లే బరువు పెరగడానికి కారణమవుతూ ఉంటాయి. ఎవరైతే రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారో వాళ్లు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మారుతున్న కాలంతో పాటే పని హడావిడి చాలామంది ఆలస్యంగా భోజనం చేయడానికి కారణమవుతూ ఉంటాయి. మరి కొందరు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో జంక్ ఫుడ్ సైతం అనారోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని రాత్రి సమయంలో భోజనం చేయడానికి, నిద్ర పోవడానికి మధ్య రెండు గంటల తేడా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

సమయపాలన లేకుండా ఆహారం తీసుకునే వాళ్లలో నిద్ర సంబంధిత సమస్యలతో పాటు అనారోగ్యానికి సంబంధించిన సమస్యలను గుర్తించామని తెలిపారు. రాత్రి సమయంలో మితంగానే భోజనం తీసుకోవాలని.. రాత్రి త్వరగా భోజనం చేసే వాళ్లు పలు వ్యాధుల బారిన తక్కువగా పడుతున్నట్టు గుర్తించామని తెలిపారు. నిపుణులు మనకు ఆకలి వేయడానికి ముందే భోజనం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

కొందరు ఒకపూట భోజనం మానేసి మరోపూట ఎక్కువ మొత్తం ఆహారం తీసుకుంటూ ఇలా చేయడం వల్ల కూడా నష్టమే తప్ప లాభం లేదని నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే నిద్రపోతే శరీరంలోని కణాలను అవసరమైన పోషకాలను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here