Connect with us

Featured

Peddi Reddy: లోకేష్ ఒక మూర్ఖుడు… ఆ కారణంతోనే పోలింగ్ శాతం పెరిగింది: పెద్దిరెడ్డి

Published

on

Peddi Reddy: వైఎస్ఆర్సిపి నాయకులందరూ ఎన్నికల పూర్తి కాగానే తమ ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు అలాగే మరికొందరికి దేశాలలో ఉన్నటువంటి వ్యాపారాల పనుల నిమిత్తం వెళ్తున్నారు ఈ క్రమంలోనే వైసిపి నేతలందరూ కూడా పర్యటనలకు వెళ్తున్నటువంటి తరుణంలో టిడిపి నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.

ఓటమి భయంతోనే వైసీపీ నేతలు అందరూ కూడా దేశం విడిచి వెళ్లిపోతున్నారంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఇలా దేశం విడిచి వైసిపి నేతలు వెళుతున్నటువంటి తరుణంలో లోకేష్ సైతం సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ట్వీట్స్ గురించి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము విదేశాలకు వెళుతున్నది ఓటమి భయంతో కాదని తెలిపారు. మాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు నిమిత్తమే తాము విదేశాలకు వెళ్తున్నామని తెలిపారు మేము వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలలో కొనసాగుతున్నమని పెద్దరెడ్డి తెలిపారు. లోకేష్ ఎంతో మూర్ఖుడని ఆయన సోషల్ మీడియా వేదిక ఇలాంటి పోస్ట్ లు చేయడం సరికాదని తెలిపారు.

Advertisement

మహిళా ఓట్లు..
జూన్ 4వ తేదీ ఎవరు ఓటమి భయంతో పారిపోతారనే విషయాలను తెలుసుకుందామని తెలిపారు. నాలుగో తేదీ కూటమినేతలందరూ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు చూడాలని ఈయన తెలిపారు. పోలింగ్ శాతం పెరిగింది అంటే మాకు ఓటమి వస్తుందని కాదని జగన్ అందించిన సంక్షేమ పాలన చూసి మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?

Published

on

Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈయన డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళే.

ఇక పూరి జగన్నాథ్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈయన సినిమాలలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈయన సినిమాలలో హీరోలు అందరూ కూడా కాస్త పొగరుగా ఉండేలాగే చూపిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలలో డైలాగ్స్ కూడా భారీ స్థాయిలో పేలుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన డైరెక్షన్ చేసిన సినిమాలలో పోకిరి సినిమా మరో లెవల్ అని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని పూరి ఓ సందర్భంలో వెల్లడించారు. తనకు పోకిరి సినిమా కంటే బిజినెస్ మాన్ సినిమాలో డైలాగ్స్ అంటే చాలా ఇష్టమని ఈయన తెలిపారు.

Advertisement

బిజినెస్ మాన్..
ఈ సినిమాలో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా అని చెప్పే డైలాగ్స్, ముంబైకి ఉచ్చ పోయించడానికి వచ్చా అంటూ డైలాగ్స్ బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అంటేనే తనకు ఇష్టం అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Tollywood: గన్నవరం చేరుకున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్.. పవన్ తో కీలక భేటీ?

Published

on

Tollywood: టాలీవుడ్ కి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. వీరంతా నేడు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో విజయవాడ క్యాంప్ ఆఫీసులో నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు.

ఈ విధంగా టాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలను వివరించబోతున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే స్పెషల్ షోస్ బెనిఫిట్ షోలకు కూడా పరిమితి లేదు. ఈ క్రమంలోనే ఈ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

గత ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా తగ్గించడమే కాకుండా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి లేకుండా చేసింది. ఈ క్రమంలోనే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చిత్రపరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక నేడు చిత్ర పరిశ్రమపై ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే భేటీ కానున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇండస్ట్రీ సమస్యలపై చర్చ..
ఇక ఈ భేటీలో భాగంగా ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీ దత్, అల్లు అరవింద్, నాగ వంశీ, యార్లగడ్డ సుప్రియ, టిజి విశ్వప్రసాద్, దగ్గుబాటి సురేష్ వంటి వారందరూ కూడా వెళ్లారని తెలుస్తోంది. మరొక మూడు రోజులలో అశ్వినీ దత్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమా విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ భేటీ అనంతరం కల్కి సినిమా టికెట్ల విషయంలో కూడా క్లారిటీ రాబోతుందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

AP Cabinet: మొదటిరోజు ప్రారంభమైన ఏపీ క్యాబినెట్.. మెగా డీఎస్సీకి ఆమోదం?

Published

on

AP Cabinet: 164 సీట్లతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమై అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గెలిచిన వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే మొదటిసారి ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ఇక ఏపీ క్యాబినెట్ సమావేశంలో భాగంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. ఇక ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా డీఎస్సీకి ఆమోదం తెలిపారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ విషయంపై క్యాబినెట్లో చర్చలు కూడా జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జులై ఒకటి నుంచి ప్రారంభం కాబోతుందని డిసెంబర్ లోపు పోస్టులన్నింటిని భర్తీ చేయాలని క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది.

Advertisement

టెట్ నిర్వహణ..
ఇకపోతే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే చాలామంది టెట్ పరీక్షను కూడా రాశారు అయితే పరీక్ష ఫలితాలు ఇప్పటివరకు వెలబడలేదు ఈ క్రమంలోనే మరోసారి నిర్వహించాలని పలువురు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కోరగా ఆయన ఈ విషయంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా మరోసారి టెట్ నిర్వహిస్తే మరి కొంతమంది నిరుద్యోగులకు డీఎస్సీ రాసే అవకాశం కూడా కలుగుతుందని భావిస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!