Connect with us

Featured

Nagarjuna: చై హ్యాపీగా ఉన్నాడు.. అది చాలు నాగచైతన్య విడాకులపై స్పందించిన నాగార్జున!

Published

on

: నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వర్సెస్ సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా గడుపుతున్నారు. నాగచైతన్య నటి సమంత ప్రేమలో పడటం ఇద్దరు కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు.

 

ఇలా నాగచైతన్య సమంత వారి వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ ఇటు నాగచైతన్య కుటుంబం ఈ విషయంపై ఏ మాత్రం స్పందించలేదు.అయితే తాజాగా సమంత తండ్రి వీరి విడాకుల విషయంపై స్పందిస్తూ ఎంతో విచారం వ్యక్తం చేయగా నాగార్జున సైతం నాగచైతన్య సమంత విడాకులపై మొదటిసారి స్పందించారు.

Advertisement

ఈ విధంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునకు చైతన్య విడాకులు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. చైతన్య గురించి ఇటీవల కాలంలో మీడియాలో వస్తున్న వార్తలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటూ ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ చైతన్య సమంత విడాకులు తీసుకోవడం వల్ల చైతన్య చాలా హ్యాపీగా ఉన్నాడు అది చాలు అంటూ సమాధానం చెప్పారు.

Nagarjuna:  అదొక అనుభవంలా మిగిలిపోతుంది..

నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఉండటాన్ని చూస్తున్నాను. ఈ విధంగా నాగచైతన్య కెరియర్లో పెళ్లి బ్రేక్ అవడం దురదృష్టమే అయితే అది ఒక అనుభవంలా ఉండిపోతుందని నాగార్జున వెల్లడించారు. ఈ విషయంపై మనం ఇంకా ఆలోచించడం సరైనది కాదు త్వరలోనే ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారని భావిస్తున్నాను అంటూ నాగార్జున ఇలా నాగచైతన్య సమంత విడాకులపై స్పందించారు. కలిసి రోజు పోట్లాడుకోవడం కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడమే ఉత్తమమని భావించి విడాకులు తీసుకున్నట్లు గతంలో కూడా నాగచైతన్య వెల్లడించారు. విడాకుల తర్వాత సమంత తాను ఇద్దరం హ్యాపీగా ఉన్నామని చైతన్య ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Featured

Namrata: మహేష్ సినిమాలో నమ్రత… రీ ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్?

Published

on

Namrata: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో భార్యగా మంచి సక్సెస్ అందుకున్నారు నటీ నమ్రత. ఈమె బాలీవుడ్ నటి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నమ్రత తెలుగులో మహేష్ బాబుతో కలిసి వంశీ అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబుతో ఈమె ప్రేమలో పడ్డారు.

ఇలా మహేష్ బాబుతో ప్రేమలో ఉన్నటువంటి నమ్రత మూడు సంవత్సరాల తర్వాత ఆయనని పెళ్లి చేసుకున్నది ఇక పెళ్లి తర్వాత ఈ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక ఈమెకు తెలుగులో పెద్ద పెద్ద సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ సినిమాలకు పూర్తిగా దూరమవుతూ కుటుంబ బాధ్యతలను అలాగే మహేష్ బాబు సినిమా బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు.

ఇలా మహేష్ సినిమా వ్యవహారాలన్నింటిని చెక్క పెట్టడమే కాకుండా ఎన్నో కమర్షియల్ బిజినెస్లను కూడా నిర్వహిస్తూ బిజినెస్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నమ్రతకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీరు కనుక మహేష్ బాబు సినిమాలో ఆయన పక్కన నటించే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది.

Advertisement

రీ ఎంట్రీ ఛాన్స్ లేదు..
ఈ ప్రశ్నకు నమ్రత సమాధానం చెబుతూ తాను ఇకపై సినిమాలలో నటిస్తూ కెమెరా ముందుకి రావాలని అసలు అనుకోవడం లేదని తెలిపారు. అది మహేష్ బాబు సరసన అయినా కూడా తాను నటించననీ కచ్చితంగా చెప్పేసారు. ఇలా రీఎంట్రి గురించి నమ్రత ఫుల్ క్లారిటీ ఇస్తూ తాను సినిమాలలో నటించే ప్రసక్తే లేదని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Nikhil: నిఖిల్ సిద్ధార్థ్ కొడుకు పేరు ఏంటో తెలుసా.. ఆ ఈవెంట్లో బయటపెట్టిన హీరో?

Published

on

Nikhil: సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు నిఖిల్. ఈయన హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ సందేశ్ కూడా ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

ఇక వరుణ్ కంటే నిఖిల్ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే నిఖిల్ డాక్టర్ పల్లవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. గత కొద్ది నెలల క్రితం ఈ దంపతులు తల్లిదండ్రులుగా కూడా ప్రమోట్ అయ్యారు.

ఇక నిఖిల్ తనకు కొడుకు పుట్టిన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు ఇక తన బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్న ఈయన తన కొడుకు పేరున ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అయితే తాజాగా వరుణ్ సందేశ్ నింద సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు భాగంగా హీరో నిఖిల్ తన కొడుకు పేరున తెలిపారు.
ధీర సిద్ధార్థ్..
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ వరుణ్ వితికా దంపతులు కూడా త్వరలోనే ఒక బేబీని ఇవ్వాలని ఈయన కోరుకున్నారు అంతేకాకుండా తనకు బాబు పుట్టిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ తన కొడుకు పేరును ఎక్కడా కూడా రివీల్ చేయలేదని తన కొడుకుకి ధీర సిద్ధార్థ అనే పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా నిఖిల్ తన కొడుకు పేరును రివీల్ చేశారు.

Advertisement

Continue Reading

Featured

YS Jagan: జగన్ ఇంటి ముందు భారీ సెక్యూరిటీ.. ప్రవేట్ సెక్యూరిటీని నియమించుకున్న జగన్?

Published

on

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా జగన్ భారీ ఓటమిని చవి చూశారు. ఈ క్రమంలోనే ఆయనకు సెక్యూరిటీ విషయంలో కూడా భద్రతను తగ్గించారని తెలుస్తోంది.

ఇలా సెక్యూరిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన సెక్యూరిటీ మాత్రమే కాకుండా ప్రవేట్ గా మరో 30 మంది సెక్యూరిటీని నియమించుకున్నారని తెలుస్తుంది. వీరందరికీ తన సొంత డబ్బుతో నియమించుకున్నట్టు సమాచారం ప్రస్తుతం సెక్యూరిటీ మొత్తం ఆయన ఇంటి ముందు నిలబడి ఇంట్లోకి ఒక్కొక్కరిగా వెళుతున్నటువంటి వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇలా తాడేపల్లి నివాసం వద్ద భారీ స్థాయిలో సెక్యూరిటీ చేరుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ కీలక నేత అయ్యన్నపాత్రుడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జగన్ ఓడిపోయాడు ఇంకా చావలేదు చచ్చే వరకు కొట్టాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

జగన్ చావలేదు..
ఇలా అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డిని చచ్చేవరకు కొట్టాలి అంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జగన్ మోహన్ రెడ్డి గురించి ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు సెక్యూరిటీ మరింత టైట్ చేశారని తెలుస్తోంది.. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ మాత్రమే కాదు పర్సనల్ సెక్యూరిటీ కూడా అవసరమని భావించి ఈ స్థాయిలో సెక్యూరిటీని నియమించుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!