Actress Payal Ghosh: మూడో మీటింగ్ లోనే ఆ డైరెక్టర్ నన్ను రేప్ చేశాడు…నటి సంచలన వ్యాఖ్యాలు!

0
118

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని పాన్ ఇండియా స్టార్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించడంతో ప్రపంచం మొత్తం తెలుగు హీరోల క్రేజ్ బాగా పెరిగిపోయింది.

ఇదిలా ఉండగా ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ తమన్నా జంటగా నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా పాయల్ గోష్ నటించింది. ఈ సినిమా తర్వాత పాయల్ టాలీవుడ్ లో మరెక్కడా కనిపించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కి మాత్రమే అంకితమైన పాయల్ ఘోష ఇటీవల మీటు అంటూ బాలీవుడ్ దర్శకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అదేవిధంగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటీవల మీటు అంటూ స్పందించిన పాయల్ గోష్ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనని రేప్ చేశాడు అంటూ పిడుగు లాంటి వార్త బయట పెట్టింది. ఇప్పటివరకు ఎంతోమంది సౌత్ ఇండియన్ దర్శకులతో పనిచేసిన కూడా వారు తన పట్ల తప్పుగా ప్రవర్తించలేదని, వారు తమ పట్ల మర్యాదపూర్వకంగా ఉండేవారని రాసుకొచ్చింది.

Actress Payal Ghosh ఎన్టీఆర్ మంచివాడు…

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో సినిమా చేయకపోయినా కూడా మూడో మీటింగ్ లోనే అతను తనని రేప్ చేశాడని సంచలనవ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ చాలా మంచివాడు, జెంటిల్ మెన్. ఆయన తన పట్ల ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. అందుకే నాకు సౌత్ ఇండస్ట్రీ పట్ల అపారమైన గౌరవం ఉంది అంటూ మరొక ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.