కరోనా నుంచి కోలుకున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!

0
59

ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు వైరస్ నుంచి బయటపడ్డారు. ఈ వైరస్ నుంచి బయటపడినప్పటికీ కొందరిలో, వివిధ రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ బారిన పడితే దాని ప్రభావం కేవలం ఊపిరితిత్తుల పైన మాత్రమే కాకుండా, వైరస్ ప్రభావం మన శరీరంలోని అన్ని భాగాలు పై దాడి చేస్తుందని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా బారిన పడతారు. అదేవిధంగా మరికొందరు కరోనా నుంచి కోలుకున్న తరువాత అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎక్కువశాతం వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఊబకాయం, మద్యం పొగ త్రాగే వారు అనేక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు కరోనా నుంచి కోలుకున్న తర్వాత తీవ్రంగా ఆయాస పడుతూ ఉంటారు. ఇందుకు గల కారణం కరోనా వైరస్ ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపడమే.ఈ విధంగా కుచించుకుపోయిన ఊపిరి తిత్తులు సాధారణ స్థితికి చేరుకునే శ్వాసక్రియకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఉండాలంటే పర్ఫెనిడోన్‌, నింటెడానిబ్‌ మందులు ఉపయోగపడతాయి. 

కరోనా నుంచి కోలుకున్న మరి కొందరిలో గుండెదడ అధికంగా ఉంటుంది. మన శరీర స్థితి మార్పు జరిగినప్పుడు ఈ విధమైనటువంటి గుండెదడ మనలో ఏర్పడుతుంది. దీనినే ఆర్థోస్టాటిక్‌ పొష్చీరియల్‌ టాకీకార్డియా అంటారు. వీరిలో పడుకొని లేవగానే ఉన్నట్టుండి గుండె దడదడా కొట్టుకుంటుంది. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు బీటా బ్లాకర్లు ఉపయోగపడతాయి. ప్రత్యేకించి గుండె మీద పనిచేసే బ్లాకర్లే వాడుకోవాలి.

మరికొందరు వ్యాధి నుంచి బయట పడిన కూడా తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. మీరు మాట్లాడే ప్రతి మాటకు ముందు దగ్గు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధమైన దగ్గు సమస్యతో బాధపడేవారు యాంటీ హిస్టమిన్‌ రకం మందులు ఉపయోగపడతాయి. అవసరమైతే ఎన్‌-అసిటైల్‌ సిస్టీన్‌ ఉపయోగించాలి. అదేవిధంగా మరికొందరిలో నీరసం, అలసట, వల్ల నొప్పులు కండరాల నొప్పులు కూడా అధికంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకొని శరీర వ్యాయామాలు చేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here