మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో జరుగుతోంది.బాలకృష్ణ, హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. బాలకృష్ణతో తొలిసారి ప్రగ్యా నటిస్తున్నారు. వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి మాట్లాడుతూ ”బాలకృష్ణగారు పాజిటివ్‌ పర్సన్‌. ఆయనతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అమేజింగ్‌” అని చెప్పారు.

కరోనా నేపథ్యంలో కెమెరా ముందుకు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో మాస్క్‌ ధరించడంతో పాటు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుతం తానొక హిందీ చిత్రం చేస్తున్నట్టు ప్రగ్యా జైస్వాల్‌ వెల్లడించారు. కానీ, ఆ సినిమా ఏదో చెప్పలేదు. అయితే, అది సల్మాన్‌ఖాన్‌ చిత్రమని ముంబై ఖబర్‌. ప్రగ్యా జైస్వాల్‌ సైతం పరోక్షంగా అదే విషయం చెప్పారు. సల్మాన్‌ఖాన్‌, ఆయుశ్‌ శర్మ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘అంతిమ్‌: ద ఫైనల్‌ ట్రూత్‌’. మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌కు జంటగా నటించే ప్రగ్యా జైస్వాల్‌ను వరించింది. ఆమె కొన్ని రోజులు షూటింగ్‌ కూడా చేశారని సమాచారం. అయితే, అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు.

బాలకృష్ణ ‘అఖండ’ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ వచ్చిన ప్రగ్యా జైస్వాల్‌, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు లైవ్‌లో సమాధానాలు ఇచ్చారు. సల్మాన్‌ ‘అంతిమ్‌’ గురించి ప్రశ్నించగా… ”ప్రస్తుతానికి నా హిందీ సినిమా వివరాలు వెల్లడించలేను. ‘మీరు సల్మాన్‌ సినిమాలో నటిస్తున్నారా?’ అని అడుగుతున్నారు. లెట్స్‌ సీ! నాకు చెప్పే అవకాశం వస్తే… తప్పకుండా చెబుతా” అని ప్రగ్యా జైస్వాల్‌ చెప్పారు. తెలుగులో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ తనకు ఇష్టమైన హీరోలు అన్నారు..ఇక తనకు బయోపిక్ లలో నటించే అవకాశం వస్తే మాత్రం ఆ చాన్స్ ని అస్సలు వదులుకోనని అంటోంది ప్రగ్యా జైస్వాల్…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here