Allari Naresh:అల్లరి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్ ఒకానొక సమయంలో ఇబ్బందులు పడ్డారు.ఇలా వరుస ఫెయిల్యూర్స్ ఎదురుకావడంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి అల్లరి నరేష్ అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో అల్లరి నరేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా అల్లరి నరేష్ కు మంచి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత వరుసగా ఈయనకు సీరియస్ పాత్రలు ఉన్నటువంటి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇలా నరేష్ తిరిగి వరస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీ అయ్యారు.
ఇకపోతే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా కోసం అల్లరి నరేష్ పాత్ర కోసం ముందుగా డైరెక్టర్ నరేష్ ని కాకుండా మెగా హీరో సాయిధరమ్ తేజ్ అయితే బాగుంటుందని అనుకున్నారట. సాయి ధరమ్ తేజ్ అప్పటికే వరుస ఫెయిల్యూర్ సినిమాలతో ఉండగా ఈ సినిమా తనకు ప్లస్ పాయింట్ అవుతుందని భావించి తనకు ఈ సినిమా కథ చెప్పగా సాయి ధరంతేజ్ ఎందుకు ఈ సినిమా రిజెక్ట్ చేశారట.

Allari Naresh: మహర్షి వదులుకున్న సాయి ధరమ్ తేజ్…
ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో తిరిగి వంశీ పైడిపల్లి ఈ సినిమా అవకాశాన్ని అల్లరి నరేష్ కు కల్పించారు. ఇలా ఈ సినిమా అల్లరి నరేష్ కు చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.