చిన్నప్పుడు బన్నీ లవర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

0
311

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లుఅర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అద్భుతమైన నటన, డాన్సులతో అదరగొట్టే బన్నీ తన చిన్నప్పటి లవర్ ఎలా ఉందో తెలుసా.. ఆమెను చూస్తే మాత్రం ఫిదా అవ్వక మానరు.

అల్లు అర్జున్ చిన్నప్పటి లవర్ అంటే నిజమైన లవర్ కాదండోయ్…. అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా హీరోగా ఆరంగ్రేటం చేసిన సినిమా గంగోత్రి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో వల్లంకి పిట్ట అంటూ ప్రకాష్ రాజ్ కూతురు గంగోత్రి కోసం పాట పాడతాడు. ఆ పాటలో ఉండే చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.

వల్లంకి పిట్ట సినిమా ద్వారా ఎంతో ముద్దు ముద్దు మాటలతో అందరిని ఆకట్టుకున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు కావ్య కళ్యాణ్ రామ్. కేవలం గంగోత్రి సినిమా మాత్రమే కాకుండా ఠాగూర్, బాలు, అడవి రాముడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఆ తర్వాత సినిమాలో నటించకుండా చదువుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పూణేలో లా కోర్సును పూర్తి చేసింది.

చదువుతుండగానే పలు సినిమాల ఆడిషన్స్ లో పాల్గొంటూ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది కావ్య. ప్రస్తుతం ఈమె ఒక సినిమాలో హీరోయిన్ గా చేయడం కోసం ఎంపికైనదనే సమాచారం కూడా వినబడుతోంది. ఏదిఏమైనా చిన్నప్పుడు వల్లంకి పాట ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈ చిన్నారి ప్రస్తుతం హీరోయిన్ గా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here