Connect with us

Featured

Anupama Parameswaran: ఎన్టీఆర్ దేవరపై ఎమోషనల్ పోస్ట్ చేసిన అనుపమ.. పోస్ట్ వైరల్?

Published

on

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు హాట్ టాపిక్ గా మారింది. కాగా మొదట ప్రేమమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆ తర్వాత తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అఆ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె యూత్ లో మంచి ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరుచుకుంది. ఆ తరువాత నుంచి మలయాళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. ఇటీవల సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది అనుపమ.

ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ రీసెంట్ గా సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథులుగా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో టిల్లు స్క్వేర్ సక్సెస్ షీల్డ్ ని ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ చేతుల మీదుగా అనుపమ అందుకున్నారు. ఈ సందర్భంగా అనుపమ ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎనిమిదేళ్ల క్రితం త్రివిక్రమ్ గారితో అఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజి షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో నాకు తరువాత రాబోయే జర్నీ గురించి ఏమి తెలియదు.

లైఫ్ నిజంగానే ఒక సర్కిల్..

Advertisement

అలా మొదలైన నా జర్నీ నేడు టిల్లు స్క్వేర్ గ్రాండ్ సక్సెస్ వరకు చేరుకుంది. ఈరోజు కూడా త్రివిక్రమ్ గారు నాతో పాటు స్టేజి పై ఉన్నారు. లైఫ్ నిజంగానే ఒక సర్కిల్. తెలుగు ఇండస్ట్రీలో నాకు గురువుగా ఉన్న త్రివిక్రమ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది అను. అనంతరం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారు మాస్ కి ఒక నిర్వచనం. ఆయన యాక్టింగ్ అండ్ డైలాగ్ తో నన్ను ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఆయనతో ఇలా స్టేజి ని పంచుకోవడం నాకు దక్కిన ఆశీర్వాదం అనుకుంటున్నాను. ఇక ఆయన దేవర సినిమా చూసి, ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కి నిలబడి క్లాప్స్ కొట్టే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను అని రాసుకొచ్చింది అనుపమ.

https://www.instagram.com/p/C5ik771J8Pv/?utm_source=ig_embed&ig_rid=3cfa4fd9-4152-44dc-8319-c020e3d0d23b

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ntr: స్థల వివాదంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్… తనకు సంబంధమే లేదంటూ?

Published

on

Ntr: నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒక స్థలం విషయంలో ఈయన కోర్టు మెట్లు ఎక్కారంటూ పెద్ద ఎత్తున వార్తలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ గీత అనే మహిళ వద్ద కోట్లలో విలువ చేసే స్థలం కొన్నారని అయితే ఆ స్థలం పై ఆమె బ్యాంకు లోన్ తీసుకోనీ వాటిని కట్టకుండా ఎగ్గొట్టారంటూ వార్తలు వచ్చాయి.

ఇలా స్థల వివాదం కారణంగా ఎన్టీఆర్ భారీ నష్టాలను ఎదుర్కోబోతున్నారు అందుకే కోర్టును ఆశ్రయించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలపై తాజాగా ఎన్టీఆర్ టీం స్పందించారు.ఎన్టీఆర్‌కు సంబంధించి ఈరోజు ప్రచురితమైన వార్తలకు ప్రతిస్పందనగా ఈ ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు.

ఏ స్థలం గురించి అయితే చర్చ జరుగుతున్నదో అదే స్థలాన్ని 2013లో ఎన్టీఆర్‌ విక్రయించారని మేము స్పష్టం చేస్తున్నామని ఇకపై ఈ స్థల వివాదానికి సంబంధించినటువంటి వార్తలలో ఎన్టీఆర్ పేరును ఉపయోగించడానికి వీలులేదు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీమ్ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఎన్టీఆర్ పేరు వాడటానికి వీలు లేదు..
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈయన దేవర సినిమాతో పాటు బాలీవుడ్ వార్ 2 సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాల దర్శకత్వంలో నటిస్తున్నటువంటి దేవర సినిమా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement
Continue Reading

Featured

Anasuya: భర్తతో కలిసి అడవులలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక త్వరలోనే అనసూయ నటించిన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె దాక్షాయని అని నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఈమె కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా అనసూయ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తన భర్త పిల్లలతో కలిసి ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నటువంటి ఈమె అడవుల బాట పడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

బర్త్ డే సెలబ్రేషన్స్..
ఇక అనసూయ తన పుట్టినరోజు వేడుకలను కూడా తన ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు. సరదాగా కేక్ కట్ చేస్తూ తన ఫ్యామిలీతో ఈమె చిల్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం అనసూయ తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

Advertisement

ఇక అనసూయ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుంచి ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది అభిమానులు ఇతర సెలబ్రిటీలు అనసూయకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Ntr: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా.. నిజమైతే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే?

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన హీరోగా ఇటీవల నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు పలు అప్డేట్స్ విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో దేవర సినిమా విడుదల అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు పెట్టబోయే టైటిల్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

Advertisement

డ్రాగన్..
ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తుందనే విషయం తెలియదు. ఎలాంటి బ్యాక్ డ్రాప్ అయినా కూడా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఇదివరకు ప్రశాంత్ తన సినిమాల ద్వారా చూపించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందేనని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!