Connect with us

Featured

Simran: సిమ్రాన్ తో ఏకంగా అంతమంది హీరోలు ప్రేమలో పడ్డారా!

Published

on

Simran: తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరం ప్రేక్షకులకు సిమ్రాన్ గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఏమైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈమె ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కాగా ఈమె తెలుగులో కలిసుందాం రా, సమరసింహారెడ్డి, నువ్వు వస్తావని, యువరాజు, నరసింహనాయుడు, డాడీ,బావ వచ్చాడు, ప్రేమతో రా,సీమ సింహం,
సీతయ్య, ఒక్కమగాడు లాంటి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.

ఈ సినిమాలలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీని సృష్టించాయి. అయితే తెలుగు కంటే ఆమె తమిళంలో ఎక్కువ చిత్రాలు చేసింది. అక్కడ కూడా టాప్‌ స్టార్స్ తో సినిమాలు చేసి మెప్పించింది. తమిళ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లోకి 1995లో ఎంట్రీ ఇచ్చి 2008 తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రధానంగా ఆమె పదేళ్లు మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంది. ఆ సమయంలోనే ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించింది సిమ్రాన్.

అయితే సిమ్రాన్‌ సక్సెస్‌ రేట్‌తో పాటు లవ్‌ ఎఫైర్ వార్తలు కూడా గట్టిగానే వచ్చాయి. ఆమె చాలా మంది హీరోలతో డేటింగ్‌ చేసిందంటూ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపించాయి. ప్రధానంగా కోలీవుడ్‌లో ఆమెపై ఎఫైర్‌ రూమర్స్ రావడం గమనార్హం. చాలా మంది హీరోలతో సిమ్రాన్‌ రొమాంటిక్‌ రిలేషన్స్ ని మెయింటేన్‌ చేసిందన్నారు. అందులో భాగంగా మొదట అబ్బాస్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. అబ్బాస్‌ సిమ్రాన్‌ని మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నాడట. కానీ సన్నిహితుల సలహా మేరకు ఆయన సిమ్రాన్ కి బ్రేకప్‌ చెప్పాడట. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రభుదేవా సోదరుడు, డాన్స్ మాస్టర్‌ రాజు సుందరం ఆమె ప్రేమలో పడ్డాడట. సిమ్రాన్‌ నటించిన చాలా సినిమాలకు రాజు సుందరం డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. అంతేకాదు హీరోగా ఐ లవ్యూ దా వంటి సినిమాలో నటించారు.

Advertisement

కమల్‌ హాసన్‌ తోనూ సిమ్రాన్‌ ఎఫైర్‌…

క్రమంలో సిమ్రాన్‌తో ఆయన ప్రేమలో పడ్డారట. చాలా కాలం పాటు ఈ ఇద్దరు లవ్‌ స్టోరీని కొనసాగించారు. వీరు కూడా పెళ్లి వరకు వెళ్లారట. ప్రభుదేవా, నయనతారల ప్రేమ వ్యవహారం పెద్ద రచ్చకావడంతో రాజు సుందరం మాస్టర్‌ సిమ్రాన్‌కి గుడ్‌ బై చెప్పేశాడట. అలాగే కమల్‌ హాసన్‌ తోనూ సిమ్రాన్‌ ఎఫైర్‌ పెట్టుకుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే ఆ వార్తలన్నింటికీ పుల్‌ స్టాప్‌ పెడుతూ సిమ్రాన్‌ 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్‌ బగ్గాని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి తర్వాత సిమ్రాన్‌ సినిమాలు తగ్గించింది. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ కొంత కాలం తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి మెప్పిస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

Published

on

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Advertisement

Continue Reading

Featured

Nagababu: నాగబాబు ట్వీట్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు!

Published

on

Nagababu: సినీ నటుడు నాగబాబు ఇటీవల ఏపీ రాజకీయాలను ఉద్దేశిస్తూ పరోక్షంగా అల్లు అర్జున్ పై చేసిన పోస్ట్ సంచలనగా మారిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన పోస్ట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారన్న విషయం స్పష్టంగా తెలియడంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో దెబ్బకు నాగబాబు ట్వీట్ డిలీట్ చేశారు.

ట్విట్టర్లో యాక్టివ్ అయినటువంటి నాగబాబు ట్వీట్ డిలీట్ చేశానంటూ మరొక ట్వీట్ చేయడంతో ఈ కామెంట్లపై జనసేన పార్టీ నుంచి ఇటీవల వైసిపికి వచ్చినటువంటి పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్నేక్ (బాబూ) కి పాలు పోసి పెంచిన కాటు వేయక తప్పదని కామెంట్లు చేశారు.

వాడుకొని వదిలేసేవారికి నమ్మకంగా ఉండని వారికి స్నేహం విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబం అని తెలిపారు.మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు.. నా పేరు సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న పుష్ప.

Advertisement

పార్టీకి విరాళం..
ఇక 2019 లో జనసేన పార్టీకి రూ.2 కోట్ల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు అంటూ పరోక్షంగా నాగబాబును ఉద్దేశిస్తూ చేసిన ఈ పోస్టు సంచలనంగా మారింది. ఇలా పరోక్షంగా నాగబాబు గురించి పోతున్న మహేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తిరిగి పవన్ అలాగే మెగా అభిమానులు పోతిన మహేష్ పై తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కామెంట్లు చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరి మధ్య యుద్ధం నడుస్తోందని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Peddi Reddy: లోకేష్ ఒక మూర్ఖుడు… ఆ కారణంతోనే పోలింగ్ శాతం పెరిగింది: పెద్దిరెడ్డి

Published

on

Peddi Reddy: వైఎస్ఆర్సిపి నాయకులందరూ ఎన్నికల పూర్తి కాగానే తమ ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు అలాగే మరికొందరికి దేశాలలో ఉన్నటువంటి వ్యాపారాల పనుల నిమిత్తం వెళ్తున్నారు ఈ క్రమంలోనే వైసిపి నేతలందరూ కూడా పర్యటనలకు వెళ్తున్నటువంటి తరుణంలో టిడిపి నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.

ఓటమి భయంతోనే వైసీపీ నేతలు అందరూ కూడా దేశం విడిచి వెళ్లిపోతున్నారంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఇలా దేశం విడిచి వైసిపి నేతలు వెళుతున్నటువంటి తరుణంలో లోకేష్ సైతం సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ట్వీట్స్ గురించి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము విదేశాలకు వెళుతున్నది ఓటమి భయంతో కాదని తెలిపారు. మాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు నిమిత్తమే తాము విదేశాలకు వెళ్తున్నామని తెలిపారు మేము వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలలో కొనసాగుతున్నమని పెద్దరెడ్డి తెలిపారు. లోకేష్ ఎంతో మూర్ఖుడని ఆయన సోషల్ మీడియా వేదిక ఇలాంటి పోస్ట్ లు చేయడం సరికాదని తెలిపారు.

Advertisement

మహిళా ఓట్లు..
జూన్ 4వ తేదీ ఎవరు ఓటమి భయంతో పారిపోతారనే విషయాలను తెలుసుకుందామని తెలిపారు. నాలుగో తేదీ కూటమినేతలందరూ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు చూడాలని ఈయన తెలిపారు. పోలింగ్ శాతం పెరిగింది అంటే మాకు ఓటమి వస్తుందని కాదని జగన్ అందించిన సంక్షేమ పాలన చూసి మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!