టాలీవుడ్ లెజెండ్ బాలయ్య షష్టిపూర్తి సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈమధ్యకాలంలో బాలయ్యతో పరోక్షంగా విమర్శలు ఎదుర్కొంటున్న చిరంజీవి కూడా మనస్ఫూర్తిగా బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో తాను ఓ పాట ప్రాక్టీస్ చేస్తున్నానని, త్వరలోనే ఆ పాటను ఫ్యాన్స్ కు వినిపిస్తానంటూ ఊరించిన బాలయ్య తన షష్ఠిపూర్తి సందర్భంగా గతంలో తాను చెప్పినట్టుగానే జగదేకవీరుని కథ సినిమాలోంచి శివశంకరి పాటను పాడి వినిపించారు. అయితే ఈ పాటపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. క్లాసికల్ సాంగ్ ను భ్రష్టు పట్టించారంటూ చాలామంది విరుచుకుపడుతున్నారు. దీనిపై నందమూరి ఫ్యాన్స్ కూడా మౌనం వహించారు. ఇప్పుడీ సాంగ్ పై మెగా బ్రదర్ నాగబాబు మాత్రం సోషల్ మీడియాలో పరోక్షంగా బాలయ్యను టార్గెట్ చేస్తూ.. ఓ ట్వీట్ ఇలా పెట్టి అలా డిలీట్ చేసేశారు. ఇంతకీ ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే..

“కరోన కన్నా భయంకరమైన సంగీతం మన సోషల్ మీడియాలో circulate అవుతుందిరా అయ్యా. జాగ్రత్తరా అయ్యా.. మీకు దండం పెడతాను.. అయ్యబాబోయ్ చిన్న పిల్లలని, వయో వృద్ధులని, ఆరోగ్యం బాగోలేని వాళ్ళని ఈ సంగీతం వినకుండా చూసుకోండి. విన్నారంటే ఏదేన జరగొచ్చు….. అయినా ఎందయ్యా ఇది.. ఇది నేను చూళ్లే.. ఎక్కడ ఇనలే.” అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు నాగబాబు. ఇలా బాలయ్య పాడిన పాటపై సెటైర్ వేసి, ఆ వెంటనే దాన్ని డిలీట్ చేశారు నాగబాబు. ఈమధ్యనే బాలయ్య, నాగబాబుల మధ్య వివాదం నెట్ లో వైరలైన సంగతి తెలిసిందే.! మళ్ళీ చాలా రోజుల తర్వాత బాలయ్య పాడిన పాటపై తన స్పందనను ట్విట్టర్ లో తెలియజేసి వెంటనే ఆ ట్వీట్ ను నాగబాబు ఎందుకు తొలిగించారనే అంశంపై సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తోంది. బాలయ్యా.. నీ పాట సూపరయ్యా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here