బిగ్ బాస్ షో దారుణమైన నిబంధనలు.. వేరే ఛానెళ్లకు వెళ్లడానికి వీళ్లేదట..?

0
133

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లు బిగ్ బాస్ కు సంబంధించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ షోకు వెళ్లాలంటే కంటెస్టెంట్లు బిగ్ బాస్ నిర్వాహకులతో అగ్రిమెంట్లు చేసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే ఆ అగ్రిమెంట్లలో కఠినమైన నిబంధనలు ఉంటాయని బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లలో ఒకరైన ముక్కు అవినాష్ వెల్లడించారు.

బిగ్ బాస్ షోలో పాల్గొంటే సంవత్సరం వరకు మరో ఛానల్ లో ప్రోగ్రాంలలో పాల్గొనకూడదని ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వులో తెలిపారు. చాలామంది బిగ్ బాస్ హౌస్ లో ఉండటం చాలా సులభమని భావిస్తారని.. బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఏవైనా ఆదేశాలు ఇస్తున్నారంటే కంటెస్టెంట్లు భయపడతారని తెలిపారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సంవత్సరం వరకు ఈవెంట్లు, సినిమాల్లో తప్ప ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కు వెళ్లకూడదని తెలిపారు.

అయితే ఒక కంటెస్టెంట్ కు మరో కంటెస్టెంట్ కు నియమనిబంధనల్లో తేడాలు ఉంటాయని అన్నారు. తను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆరునెలల పాటు ఇతర ఛానెళ్లలో ప్రోగ్రామ్ లు చేయడానికి వీలులేదని అన్నారు. ఇత కామెడీ షోలలో ఆఫర్ వచ్చినా తనకు వెళ్లే అవకాశం లేదని అవినాష్ పరోక్షంగా తెలిపారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లు స్టార్ మా ఛానెల్ ఆఫర్ ఇస్తే ఆ ఛానల్ లో ప్రోగ్రామ్స్ చేయవచ్చు.

మరోవైపు అవినాష్ కు నాగబాబు బొమ్మ అదిరింది షోలో ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అవినాష్ కు బొమ్మ అదిరింది షోలో ఆఫర్ వస్తే మాత్రం అవినాష్ మళ్లీ బిగ్ బాస్ అగ్రిమెంట్ ను బ్రేక్ చేస్తాడేమో చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here