దేశ ప్రజలకు అలర్ట్.. కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తారా..? ఇవ్వరా..?

0
308

భారతదేశంలో ప్రజలకు కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. దేశంలోని ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుందని భావిస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేయడం లేదు. తొలి దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో వ్యాక్సిన్ తీసుకునే వారికి మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. తొలి దశలో 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.

ఆ తరువాత వ్యాక్సిన్ ను ప్రజలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. నీతి అయోగ్ సభ్యులలో ఒకరైన డాక్టర్ వినోద్ పాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి దశ కరోనా వ్యాక్సిన్ భారాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం మోస్తుందని తెలిపారు. దేశంలోని 29 వేల వ్యాక్సినేషన్ పాయింట్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ కోసం 31 హబ్ లను ఏర్పాటు చేసింది.

మొదట వృద్ధులు, ఆరోగ్యశాఖలో పని చేసేవారికి వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. కేంద్రం కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుందని తెలుస్తోంది. మరోవైపు సీరమ్ సంస్థకు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ ఆమోదం తెలపడం గురించి స్పందిస్తూ మన దేశంలోని క్లినికల్ ట్రయల్స్ ఫలితాలతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన డేటాను కూడా పరిశీలిస్తున్నామని అన్నారు.

కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ను 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తీసుకోవచ్చు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఇంజెక్షన్ రూపంలో కండరాల్లోకి ఎక్కే విధంగా ఇస్తారు. తొలి డోస్ కు, రెండో డోస్ కు 4 నుంచి 6 వారాల గ్యాప్ ఉంటుంది. వ్యాక్సిన్ ను ఇచ్చిన తరువాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించి నివేదికను అధికారులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాత్రం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ గురించి స్పష్టత రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.