Connect with us

General News

Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!

Flash News: తెలంగాణ సీఎం దళితులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల

Published

on

Flash News: తెలంగాణ సీఎం దళితులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని.. ప్రతీ ఏటా రెండుమూడు లక్షల మందికి దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. మార్చి తరువాత ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల మందికి దళిత బంధు ఇస్తామని వెల్లడించారు. 

Advertisement
Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!
Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!

శరీరంలో ఏ భాగం మంచిగా లేకున్నా.. శరీరం మొత్తం బాగున్నట్లు కాదని.. దళితులు కూడా అభివ్రుద్ది చేసుకుందామని అన్నారు సీఎం కేసీఆర్. దళితబంధు పథకం చూసి  చాలా మందికి కళ్లు మండుతున్నాయని ప్రతిపక్షాలను విమర్శించారు. ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని అన్నార. 

Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!
Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!

దళిత బంధులో రూ. 10 లక్షలు ఇవ్వడమే కాకుండా.. మెడికల్ షాపుల్లో, ఫెర్టిలైజర్ షాపుల్లో, ప్రభుత్వ కాంట్రాక్ట్ లో, బార్, వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామని అన్నారు. ఇలా భారత దేశంలో ఏ రాష్ట్రం ఎక్కడా చేయలేదని అన్నారు. 

మోదీకి కేసీఆర్ వార్నింగ్..

మరోవైపు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ బోర్ల దగ్గర మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని… నన్ను చంపినా ఆ పని చేయను అని..ఏం చేసుకుంటావో చేసుకో అని మోదీకి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. బీజేపీ వాళ్లు టీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే నశం చేస్తామంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఢిల్లీ కోటలు బద్ధలు కొడతా అంటూ.. వ్యాఖ్యానించారు.

Advertisement

Featured

RGV: అప్పటివరకు వర్మను అరెస్ట్ చేయొద్దు.. వర్మకు ఊరట ఇచ్చిన హైకోర్టు!

Published

on

RGV: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు కాస్త ఊరట కల్పించింది. ఈయనపై కేసు నమోదు కావడంతో తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాలి అంటూ రామ్ గోపాల్ వర్మ కోరుకున్న ఆశ్రయించడంతో కోర్టు ఆ పిటిషన్కొట్టి వేసింది అయితే ఈయన మరోసారి ముందస్తు బెయిల్ కు అప్లై చేశారు.

Advertisement

తనపై కేసు నమోదు కావడంతో పోలీసులు కనుక తననీ అరెస్టు చేస్తే తప్పనిసరిగా తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని అందుకే తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఈయన కోరారు. ఇప్పటికే ఈ బెయిల్ విచారణ పలు సందర్భాలలో వాయిదా పడింది తాజగా ఈ బెయిల్ పిటిషన్ పరిశీలించిన కోర్టు వచ్చే సోమవారం వరకు ఈయనని అరెస్టు చేయొద్దు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విధంగా వచ్చే సోమవారం వరకు ఈయనని అరెస్టు చేయకూడదు అంటూ ఆదేశాలను జారీ చేయడంతో రామ్ గోపాల్ వర్మకు కాస్త ఊరట కలిగిందని చెప్పాలి. ఇక ఈయన వచ్చే సోమవారం లోపు సరైన వివరణ ఇవ్వకపోతే కోర్టు తిరిగి ఈయనపై చర్యలు తీసుకోవడం, లేదా అరెస్టు చేయడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.

RGV: అరెస్టు వద్దు..

ఇలా రాంగోపాల్ వర్మ వచ్చే సోమవారం లోపు తన వివరణ ఇస్తారా లేదంటే అరెస్టయి జైలుకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వచ్చే సోమవారం వరకు తనని అరెస్టు చేయకూడదు అంటూ కోర్టు ఆదేశాలను ఇవ్వడంతో ఈయనకు కాస్త ఊరట కలిగిందని చెప్పాలి.

Advertisement
Continue Reading

devotional

Tirumala: తిరుమల వెళ్లే రాజకీయ నాయకులు అలర్ట్… నేటి నుంచి అమలులోకి కొత్త నిబంధనలు!

Published

on

Tirumala: కలియుగ దైవం అయినటువంటి తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా బిఆర్ నాయుడు ఎంపికైన విషయం తెలిసినదే.

Advertisement

ఇలా ఈయన చైర్మన్గా ఎంపికైన తర్వాత మొదటిసారి పాలక మండల సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో భాగంగా తిరుమలలో కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు ముఖ్యంగా ఆలయ ప్రతిష్టతను కాపాడటం కోసం ఆలయ ప్రాంగణంలో ఎవరు కూడా రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాట్లాడకూడదని తెలిపారు.

ఇలా పాలకమండలి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని భక్తులు కూడా స్వాగతిస్తున్నారు ఆలయ ప్రతిష్టతను కాపాడాలి అంటే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈ నిర్ణయం పట్ల భక్తులు కూడా సానుకూలంగా వ్యవహరించారు. అయితే బోర్డు సభ్యులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు నేటి నుంచి అమలులోకి రాబోతున్నాయని తెలుస్తోంది.

Tirumala: రాజకీయాలకు చోటు లేదు..

రేపటి నుంచి తిరుమల ఆలయానికి వెళ్లినటువంటి రాజకీయ నాయకులైన ఇతర భక్తులు అయిన ఆలయ ప్రాంగణంలో రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడిన అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న కూడా వారిపట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇకపై తిరుమల ఆలయానికి వెళ్లినవారు అక్కడ స్వామి వారి గురించి మాత్రమే మాట్లాడాలి తప్ప రాజకీయాలకు తావు లేదని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

devotional

Tirumala: శ్రీ వారి ఆలయంలో చోరీ… భద్రతా చర్యల పై మండిపడుతున్న భక్తులు!

Published

on

Tirumala: కలియుగ దైవం, ఏడుకొండల వాడు… వడ్డీ కాసుల వాడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగిందని విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆపద మొక్కుల వాడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఇలా భక్తుడు ఏకంగా స్వామివారి హుండీలో దొంగతనం చేయడం పట్ల భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Advertisement

ఈ ఘటన నవంబర్ 23వ తేదీ జరగగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిత్యం స్వామి వారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది తిరుమలకు చేరుకుంటారు. కొండపై నిత్యం గోవింద నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. ఇలాంటి ఆలయంలో భక్తుడిగా తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి స్వామివారి దర్శనం కోసం వెళ్లారు అయితే ఈయన హుండీలో నుంచి 15000 రూపాయలను దొంగలించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది.

ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ పారిపోయాడని సీసీ కెమెరా మానిటరింగ్ చేస్తున్న జ్ఞానేంద్ర అనే ఆపరేటర్ గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు వెంటనే అతనిని ట్రేస్ చేసి నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు అరెస్టు చేయడమే కాకుండా తమదైన శైలిలోనే విచారణ చేయడంతో దొంగలించిన 15 వేల రూపాయలను తిరిగి వెనక్కి ఇచ్చారు.

Tirumala: 15 వేలు…

ఇక ఈ విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనగా మారింది. ఓ భక్తుడు స్వయంగా హుండీలో డబ్బులను చోరీ చేస్తుంటే అక్కడ భద్రత చర్యలు ఎలా ఉన్నాయో స్పష్టం అవుతుందని భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!