RK Roja: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా… తెలంగాణ సీఎం పై ప్రశంసల కురిపించిన మంత్రి!

0
18

RK Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్న రోజాశ్రావణ మాసంలో స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రావణమాసంలో ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. స్వామివారి కరుణ కటాక్షాలు తనపై ఉండి, ప్రజలకు మరింత సేవ చేయడం కోసం తనకు శక్తి సామర్థ్యాలను ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న అంటూ ఈమె వెల్లడించారు.ఇకపోతే తాను గతంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత తనకు మంత్రి పదవి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇకపోతే స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ పనుల గురించి ఈమె మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పై ప్రశంసల కురిపించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ నిర్మాణాన్ని ఎంతో అద్భుతంగా చేపట్టారని ఈ సందర్భంగా రోజా పేర్కొన్నారు. ఇలా నరసింహస్వామి వారి ఆలయం నిర్మించడం కేసీఆర్ గారికి పూర్వజన్మ సుకృతం అంటూ తెలిపారు.

RK Roja: అరుదైన అవకాశం కేసీఆర్ గారికి దక్కింది…

సాధారణంగా భగవంతుడు తనకు నచ్చిన వారితోనే ఆలయం నిర్మించుకుంటారని అలాగే స్వామివారి ఆలయాన్ని నిర్మించే పుణ్యఫలం కేసీఆర్ కి దక్కిందంటూ ఈమె కేసీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రోజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.