మనలో చాలామందికి దేశంలో ప్రముఖ రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలను తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. మన దేశ ప్రధానికి ఎంత ఆస్తి ఉంటుంది..? అనే ప్రశ్న వేస్తే చాలామంది నుంచి తెలీదనే సమాధానం వినిపిస్తుంది. అయితే వాళ్లకు ఎంత ఆస్తి ఉందో స్వయంగా వాళ్లు చెబితే తప్ప మనకు తెలిసే అవకాశాలు ఉండవు. అయితే ప్రతి విషయంలోనూ ప్రజలతో పారదర్శకంగా ఉండే మోదీ తన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

2.85 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు మోదీ స్వచ్చందంగా ప్రకటించారు. 2020 జూన్ 30వ తేదీ వరకు ఉన్న ఆస్తి వివరాలను ఆయన తెలియజేశారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదికి మోదీ ఆస్తి పెరగడం గమనార్హం. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి మోదీ ఆస్తి 2.49 కోట్ల రూపాయలు కాగా సంవత్సర కాలం మోదీ బ్యాంక్ బ్యాలన్స్ పెరగడం వల్ల ఆయన ఆస్తి ఏకంగా 36 లక్షల రూపాయలు పెరిగినట్టు తెలుస్తోంది.

అయితే దేశ ప్రధానికి ఆస్తులు ఉన్నాయి కానీ అప్పు మాత్రం లేదు. జూన్ 30వ తేదీ నాటికి మోదీ బ్యాంక్ ఖాతాలో 3,38,000 రూపాయలు ఉండగా చేతిలో 31,450 రూపాయల క్యాష్ ఉంది. మోదీ దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇం్దియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్లను కలిగి ఉన్నారు. మోదీ పేరు మీద కోటీ 60 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. లక్షన్నర రూపాయల విలువ చేసే 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి.

గుజరాత్ లోని గాంధీనగర్ లో మోదీకి ప్లాట్, ఇల్లు ఉండగా వాటి విలువ కోటీ పది లక్షల రూపాయలు. అయితే మోదీ పేరు మీద ఒక్క కారు కూడా లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, లైఫ్ ఇన్సూరెన్స్ లో మోదీ ఇన్వెస్ట్ చేశారు. హోం మంత్రి అమిత్ షా ఆస్తి 2019లో 32 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం 28.63 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here