గుడ్డు తిన్నప్పుడు ఈ పొరపాటు చేస్తే అంతే సంగతులు!

0
249

ప్రోటీన్ కు కేరాఫ్ అడ్రస్ గా గుడ్లను చెబుతూ ఉంటారు. అయితే గుడ్డులో కూడా లోపలి పసుపు భాగాన్ని తీసేసి తెల్లటి భాగాన్ని మాత్రమే తింటుంటారు చాలామంది. ఇలా తినడం కరెక్టేనా..? అంటే దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. సాధరణంగా పచ్చసొనలో ఎక్కువ కొలెస్టరాల్ ఉంటుంది. ఇది శరీరానికి హానికరం అని అంటుంటారు కానీ అందులో కొలెస్టరాల్ అనేది 186 మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అది మన శరీరానికి హాని తలపెట్టేంత ప్రమాదకరమైనది కాదంటూ నిపుణులు చెబుతున్నారు. అయితే మన శరీరానికి కొలెస్టరాల్ కూడా అవసరం. అది టెస్టోస్టిరాన్ ను తయారు చేస్తుంది. ఇంకా పచ్చసొనలో వివిధ రకాల విటమిన్లు కూడా ఉంటాయి. విటమిన్ ఏ,డీ, ఈ, బీ12 , కే, ఐరన్ మరియు రైబోఫ్లేవిన్ వంటివి ఉంటాయి. ఇవి శరీర సమత్యులతు ఎంతగానో ఉపయోగపడతాయి.

తెల్లసొనలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రతీ వారం కనీసం ఏడు గుడ్లు తినాలని.. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించారు. ఇలా తీసుకుంటే గుండె జబ్బులు రావని జర్నల్ లో పేర్కొన్నారు. ఇంకా పచ్చసొనలో కోలిన్ కు ముఖ్యమైన మూలంగా ఉంటాయి. మెదడులోని ఇది న్యూరోట్రాన్స్మిటర్లకు ఎంతో ఉపయోగపడుతుంది.

మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భాధారణ మరియు పిల్లలకు పాలిచ్చే సమయంలో ఎంతగానో సహకరిస్తాయి. కళ్లను కాపాడటంలో.. శరీరానికి శక్తిని అందించండంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చసొన వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని.. అలా అని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.