కేంద్రం సూచించిన కొత్త నిబంధనలకు అన్ని సంస్థలు అంగీకారం… ట్విట్టర్ తప్పా?

0
163

భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, గూగుల్, వాట్సాప్, ట్విట్టర్ పాటించాలని, లేకపోతే ఆ సంస్థల పై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సూచించిన కొత్త నిబంధనలకు ట్విట్టర్ తప్ప ఇతర సంస్థలన్నీ నిబంధనలను పాటించాలనే అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు తమ నోడల్‌ అధికారి, ఫిర్యాదుల్ని పరిష్కరించే అధికారి, కంప్లయెన్స్‌ అధికారికి సంబంధించిన విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలను పాటిస్తూ సంబంధిత అధికారులకు సంబంధించిన విషయాలను తెలియజేయడానికి అన్ని సోషల్ మీడియా సంస్థలు అంగీకారం తెలిపిన, ట్విట్టర్ మాత్రం అందుకు సమ్మతంగా లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన కొత్త నిబంధనలను పాటించడం ద్వారా తమ ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టును వాట్సప్ ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ కూడా ఈ నిబంధనల వల్ల తమ ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వ్యాఖ్యానించింది.

ఈ నిబంధనల ప్రకారం భారతదేశంలో తమ సంస్థలో పని చేసే చీఫ్‌ కంపిలియన్స్‌ ఆఫీసర్లు (సీసీవో), కాంటాక్ట్‌ పర్సన్‌ (ఎన్‌సీపీ), ఫిర్యాదుల స్వీకరణ అధికారి (జీపీ) వివరాలను తెలియజేశాయి. కానీ ట్విట్టర్ మాత్రం కేవలం సీసీవో వివరాలను వెల్లడించక పోవడంతో ట్విట్టర్ ,కేంద్రం మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో వర్తించే చట్టానికి లోబడి ఉంటాం కానీ ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నట్టే సేవల్లో పారదర్శకత, చట్ట నిబంధనల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ, గోప్యతను పరిరక్షించే సూత్రాల ద్వారా మేం మార్గనిర్దేశం చేస్తామని ట్విట్టర్ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here