ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు అనుగుణంగా, వాతావరణ కాలుష్యంలో మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలలో జుట్టు రాలడం అతి పెద్ద సమస్యగా మారింది. మన చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే వాటిలో జుట్టు ఒకటి. అయితే ఈ మధ్య కాలంలో అధికంగా జుట్టు రాలిపోవడంతో ఎంతోమందికి బట్టతల ఏర్పడి అందవిహీనంగా కనిపిస్తుంటారు. కొందరిలో జుట్టు రాలుతుండగానే ఎన్నో జాగ్రత్తలను పాటిస్తున్నప్పటికీ, ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.

అధిక జుట్టురాలడం వల్ల కొందరు బట్టతల వస్తుందేమోనని భయపడుతుంటారు.ఈ విధంగా బట్టతల వల్ల భయపడే వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

  • చక్కెర: జుట్టు అధికంగా రాలే వారు వీలైనంత వరకు చక్కెరను పూర్తిగా తగ్గించడం లేదా చక్కెర కు గుడ్ బై చెప్పడం ఎంతో ఉత్తమం. చక్కెరలో అధికభాగం గ్లైసెమిక్ సూచికలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంలో హార్మోన్లు అసమతుల్యతకు దారితీసే ఇన్సులిన్ స్థాయిలను గణనీయంగా పెంచుతూ జుట్టు రాలడానికి కారణం అవుతాయి కనుక వీలైనంత వరకు చక్కెరను తగ్గించడం ఎంతో ఉత్తమం.
  • ఆల్కహాల్: ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల ప్రొటీన్లు బలహీనపడి జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
  • జంక్ ఫుడ్: జంక్ ఫుడ్ అధికంగా తీసుకునే వారు సాచ్యురేటెడ్ కొవ్వుల వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. ఈ క్రమంలోనే గుండెజబ్బుల బారిన పడటమే కాకుండా అధికంగా జుట్టు రాలిపోవడానికి కూడా కారణం అవుతుంది. కనుక జుట్టు అధికంగా రాలుతున్నవారు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం మంచిది.
  • గుడ్లు: సాధారణంగా గుడ్లలో ఎన్నో ప్రొటీన్లు ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. కానీ పచ్చి ఎగ్ వైట్ తీసుకోవడం వల్ల బయోటిన్ లోపం ఏర్పడుతుంది. జుట్టు పెరుగుదలకు దోహదపడే కెరటిన్ ఉత్పత్తి చేయడంలో బయోటిన్ కీలక పాత్ర వహిస్తుంది. కానీ ఎగ్ వైట్ తీసుకోవటం వల్ల బయటి లోపం తలెత్తి జుట్టుకు సరైన పోషణ తగ్గి రాలడం మొదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here