Balakrishna: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో బాలకృష్ణ ఒకరు. సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ కెరియర్లో దూసుకుపోవడమే కాకుండా మరోవైపు రాజకీయాలలో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు.

బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా ఒకవైపు ఎమ్మెల్యేగా రాజకీయాలలో దూసుకుపోతున్న ఈయన మరోవైపు చిత్ర పరిశ్రమలో కూడా వరుస విజయాలని సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో బాలకృష్ణ నటించిన అఖండ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలు వరుస విజయాలతో ప్రేక్షకులను సందడి చేశాయి.
ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఈయన అభిమానులు ఇతర సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ కెరియర్ కి సంబంధించి ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు బాలయ్య 108 సినిమాలలో నటించారు. అయితే ఈయన కెరియర్ లో ఏ సినిమా సాధించలేని విజయం ఓ సినిమా సాధించిందని చెప్పాలి.
అఖండ..
ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన సినిమాలలో ఆఖండ సినిమా ఏకంగా 400 రోజులు థియేటర్లలో ప్రదర్శితం అవుతూ సంచలనాలను సృష్టించింది. ఇలా బాలయ్య కెరియర్లో అఖండ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పాలి.బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా సమయంలో విడుదలైన సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో త్వరలోనే సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.



























