సాధారణంగా మనలో చాలా మందికి ఈ పేల సమస్య బాధిస్తుంటుంది. ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందటానికి కొందరు మార్కెట్లో లభ్యమయ్యే ఎన్నో రకాల షాంపూలను ప్రయత్నిస్తుంటారు. కానీ వాటివల్ల ఎలాంటి ఫలితం లేనప్పటికీ ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో తెలియక ఎంతోమంది జుట్టును కత్తిరించుకోవడం చేస్తుంటారు. ఈ పేల సమస్య వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు.ఇంతగా వేధిస్తున్న ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే కొన్ని సులువైన.పరిష్కార మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం…

ఎక్కువ పేల సమస్యతో బాధపడేవారికి వెల్లుల్లి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ముందుగా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమానికి తగినంత పరిమాణంలో నిమ్మరసం కలిపి తల మాడుకు పట్టించి కొన వేళ్ళతో బాగా మర్దన చేయాలి. ఈ విధంగా ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయించి దువ్వెనతో దువ్వడం ద్వారా మన తలలో ఉన్న పేల్లు కిందికి రాలిపోతాయి.

వేపాకు మెత్తగా రుబ్బి అందులో రెండు టేబుల్ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని తలంతా పట్టించి గంట తర్వాత తలస్నానం చేయడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా తెల్ల ఉల్లిగడ్డల రసం తల మాడుకు అంటించడం ద్వారా పేల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మార్కెట్లో లభ్యమయ్యే వేప గింజల నూనెను తీసుకొని మన తలకు అంటించడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. ఈ విధంగా సులువైన మార్గాల ద్వారా పేల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here