నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతితో పోస్టాఫీస్ ఉద్యోగాలు..?

0
85

పదో తరగతి పాసైన వాళ్లకు ఇండియా పోస్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 3,446 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. https://appost.in/gdsonline/home.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 3,446 ఖాళీలలో ఏపీలో లో 2296 ఉద్యోగ ఖాళీలు, తెలంగాణలో 1150 ఖాళీలు ఉన్నాయి.

https://appost.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 26 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలలో బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం), డాక్ సేవ‌క్‌ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

స్థానిక భాషపై పట్టు ఉండి ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులలో ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి సంబంధిత గ్రామ ప‌రిధిలో తప్పనిసరిగా నివాసం ఉండాలి. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

ఎలాంటి ఇంటర్వ్యూ, రాత పరీక్ష లేకుండా ఎంపికయ్యే ఉద్యోగాలు కావడంతో ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here