ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 118 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పాసైన కృష్ణా జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://krishnadccb.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పోస్టును బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి.

మొత్తం 118 ఉద్యోగాలలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 72 ఉండగా అసిస్టెంట్ మేనేజ‌ర్ ఉద్యోగ ఖాళీలు 28, పీఏసీఎస్ స్టాఫ్ ఉద్యోగాల కొరకు 18 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 118 ఉద్యోగ ఖాళీలలో 43 ఉద్యోగాలను మహిళలకు కేటాయించారు. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 24 వేల రూపాయలు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారు 33 వేల రూపాయలు వేతనం పొందవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 31 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇంగ్లిష్, తెలుగు భాషలలో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. కృష్ణా జిల్లా అభ్యర్థులై ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. ఇంటర్వ్యూ, ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేష‌న్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here